Drumstick Benefits : మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

by Sumithra |   ( Updated:2023-07-01 13:39:34.0  )
Drumstick Benefits : మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
X

దిశ, వెబ్‌డెస్క్ : మునక్కాయ.. ఈ పేరు వింటేనే చాలు చాలా మందికి దాంతో చేసే స్పెషల్స్ గుర్తొచ్చి నోరూరుతూ ఉంటుంది. మునక్కాయతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. అటు రుచిలోనూ, ఇటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ మునక్కాయ ముందుంటుంది. మునక్కాయలో మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్‌, మెగ్నీషియం, సోడియం, ఏ, B1, B2, B3, B5, B6, B9, సి, వంటి పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. అంతే కాదు మునక్కాయలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఈ మునక్కాయలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా..

మునక్కాయి తినడం వలన మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సిలు మనిషిని ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తాయి. వాటితోపాటుగానే దగ్గు, ఆస్తమా, గురక ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలను మునగలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు తగ్గిస్తాయి. అదేవిధంగా కళ్లు పొడిబారడం, కంటిశుక్లం వంటి సమస్యలు మునగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా తగ్గుముఖం పడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లవల్ల కంటిసమస్యలను నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే మునక్కాయలోని విటమిన్ B12, B, రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్‌ వంటి పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి. అలాగే మునగలో ఉండే డైటరీ ఫైబర్‌ పేగు కదలికలను సులభం చేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో వచ్చే ముప్పు తగ్గించి వాటి పనితీరు మెరుగుపరుస్తాయి. వృద్ధులు మునక్కాయ తింటే ఆస్టియోపోరోసిస్‌ లక్షణాలను తగ్గించి, ఎముకల సాంద్రత పునరుద్ధరిస్తుంది. మునగలో ఉండే ఐరన్‌, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. విటమిన్లు ఎ, సి, బీటా కెరోటిన్, నియాజిమిసిన్ విటమిన్లు క్యాన్సర్‌ కణాలను చంపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రొఫైల్ గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Read more: ప్రతిరోజూ చికెన్ తింటే ఈ రోగాలు రావడం ఖాయం.

Advertisement

Next Story

Most Viewed