బ్లూ టీ తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

by Prasanna |
బ్లూ టీ తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా తర్వాత నుంచి మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు రోగాల బారిన పడుతున్నారు. ఎందుకంటే ఫాస్ట్ పుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం లాంటి ఆహార పదార్ధాలు తినడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నారు చాలా మంది. అలాగే మనలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా టీని ఇష్టపడతారు. రోజులో కనీసం ఒక కప్పు టీ అయినా తాగకుండా ఉండలేరు. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో వయస్సును కనబడకుండా చేయడంలో ఈ బ్లూ టీ అద్భుతంగా పని చేస్తుంది. బ్లూ టీ తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..

ఈ బ్లూ టీని శంఖు పూలతో తయారు చేస్తారు. ఈ పూలలో బరువు తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే కొవ్వు ఎక్కువగా ఉన్న వారు.. దీన్ని రోజు తాగడం వలన కొవ్వు కరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డిప్రెషన్ , మానసిక ఒత్తిడి సమస్యలకు ఈ టీ చెక్ పెడుతుంది. బ్లూ టీ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు

Also Read: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం అంత కష్టమా.. మెనూ యాంగ్జైటీ వేధిస్తోందట !

Next Story

Most Viewed