- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Water: వేసవి కాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనకి దాహం వేసినప్పుడు వాటర్ ( Water ) ను తాగుతుంటాము. కానీ, ఎవరు ఎంత తాగాలి అని ఇప్పటికి తెలియదు. ఇది వ్యక్తి చేసే పని, ఆరోగ్య స్థితి వంటి ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ నీటిని తక్కువ తీసుకున్నా సమస్యే అని కొందరు, ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఇంకొందరు అంటుంటారు. మరి, వేసవి కాలంలో ఒక వ్యక్తి రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం..
మనలో చాలా మంది ఉదయాన్నే నీళ్లు తాగాలని తాగుతుంటారు. ఇలా తాగడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతుంటారు. మరికొందరు, ప్రతిరోజూ లెక్క ప్రకారం నీరు తాగాల్సిందేనని అంటారు. నిజానికి, ఒక మనిషి రోజుకు ఎంత వాటర్ తాగాలో చెప్పే లెక్కలు ఎక్కడా లేవు. అయితే, ఎండల తీవ్రత, మనిషి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నీటిని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఒక మనిషి రోజుకు కనీసం లీటర్ నుంచి రెండు లీటర్ల వాటర్ ను కచ్చితంగా తీసుకోవాలని అంటున్నారు. అప్పుడే ఆరోగ్యంగా ( Health ) ఉంటారని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తి పని ప్రదేశాన్ని బట్టి ఈ లెక్కలు మారుతాయి. ఆఫీసులో కూర్చొని చేసే పని అయితే, వారు రోజుకు 2 లీటర్ల వరకు నీరు తాగాలి. ఎండలో పని చేసే వ్యవసాయ రైతులు, కూలీలు చెమట ద్వారా నీటిని కోల్పోతారు. కాబట్టి, వీరు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని డాక్టర్స్ సూచించారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.