- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజులో ఎన్ని గంటలు బ్రా వేసుకోవాలో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఆడవారి డ్రెస్సింగ్ స్టైల్‌లో బ్రా ఒకటి. వక్షోజాలు సరైన ఆకృతిలో ఉండటానికి మహిళలు బ్రా వేసుకుంటారు. అంతే కాకుండా కొంత మంది డ్రెసెస్ కంఫర్ట్‌గా ఉండటానికి బ్రా వాడుతుంటారు. అయితే ఈ బ్రా వాడటంపై కూడా కొందరిలో కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంత మంది,బ్రా రోజూ వేసుకోవడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, నలుపు రంగు బ్రాను వాడకూడదు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా రెగ్యూలర్‌గా బ్రా వేసుకోవచ్చా? రోజులో ఎన్ని గంటలు దీన్ని వేసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలు ఉంటాయి. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రా వేసుకున్న వారు చాలా కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కానీ దీని వలన లాభాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయంట. అవి ఏమిటంటే?.. ఎక్కవ సేపు బ్రా వేసుకోవడం వలన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. కొంత మంది రోజూ మొత్తం బ్రా వేసుకుంటారు. కానీ దీని వలన అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉన్నదంట. రెగ్యూలర్‌గా బ్రా వేసుకోవడం వలన ఆడవారికి ఎక్కువగా భుజం, మెడనొప్పి , అంతే కాకుండా పై భాగంలో బరువు మోస్తున్నట్లు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే రొమ్ముల చుట్టూ ధూళి, చెమట చేరి మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువలన రోజులో ఎనిమిది గంటలు మాత్రమే బ్రా వాడాలంట. దీని వలన రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుందంట. అంతే కాకుండా మహిళలు బ్రాను ఎంచుకునే సమయంలో ఆచి తూచి అడుగు వేయాలంట. మంచి బ్రాండెడ్ కంపెనీ, తేమని గ్రహించి, గాలి ప్రవాహం సరిగా ఉండే బ్రాలు ఎంచుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు.