ఈ చిన్న మిస్టేక్ మీ చర్మానికి ఎంత ముప్పు తెచ్చిపెడుతుందో తెలుసా?

by Anjali |   ( Updated:2024-09-17 10:28:12.0  )
ఈ చిన్న మిస్టేక్ మీ చర్మానికి ఎంత ముప్పు తెచ్చిపెడుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి ఒక అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం వారు పలు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం, బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. ఫేస్‌పై చిన్న పింపుల్ కాగానే తెగ టెన్షన్ పడిపోతుంటారు. దాన్ని తొలగించడానికి ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటారు.

అయితే అందంగా కనిపించడం అనేది మన చర్మంపైనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్సే స్కిన్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. కాగా ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్కిన్ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా చర్మాన్ని తాకుతారు. దీంతో మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. హ్యాండ్స్‌కు దుమ్ము, ధూళి ఉంటుంది. చేతులు క్లీన్ చేసుకోకుండా స్కిన్‌కు తాకడం వల్ల పింపుల్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా సరే ఫేస్‌పై చేతులు పెట్టే ముందు పక్కా క్లీన్ చేసుకోవాలి.

అలాగే చర్మ సంరక్షణ కోసం గోరువెచ్చని నీటిని వాడితే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకే క్లెన్సర్ యూస్ చేయడం ద్వారా ఫేస్‌పై ముడతలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఎక్కువ కాలంపాలు ఒకే క్లెన్సర్ ను వాడకుండా మారుస్తూ ఉండాలి. క్లెన్సర్ ను కఠిన పద్ధతిలో అస్సలు వాడవద్దు. మీ స్కిన్ మరింత పాడయ్యే చాన్సెస్ ఉంటాయి.

మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే? రోజుకు రెండు సార్లు మాత్రమే ఫేస్ వాష్ చేసుకోవాలి. పలువురు రోజుకు ఎక్కువ సార్లు ముఖం కడుగుతారు. దీంతో స్కిన్ ద్వారా ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ ను పొగొట్టి ఫేస్ పొడిగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

​గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed