- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health: ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టె ఈ ఆకు గురించి తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవాలి. ఏ ఇంట్లో అయిన వారానికి ఒకటి లేదా రెండు సార్లు నాన్ వెజ్ , మరో నాలుగు రోజులు కూరగాయలను తింటుంటారు. కొందరు రోజూ కూరలు చేసుకోకుండా కారం పొడిలను చేసుకుని తీసుకుంటారు. వాటిలో ఎక్కువగా మునగాకు నువ్వుల పొడిని తింటారు. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. చలికాలంలో నువ్వులను తీసుకోవడం వలన బాడీని వేడిగా ఉంచుతుంది. మునగాకు నువ్వుల పొడి వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఇమ్మ్యూనిటీ పవర్ : మునగాకులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
రక్తహీనత : నువ్వులలో ఐరన్‌కు ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తినడం వలన రక్తహీనత సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మునగాకు నువ్వుల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.. అలాగే, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది: మునగాకులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
శక్తి : ఈ పొడిలో ఉండే ప్రోటీన్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.
ఎముకల పనితీరు : మునగాకు నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి.
బరువు : ఈ పొడిలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించి బరువును తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.