ఈ దుంప గురించి తెలుసా? వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం ఇదేనట

by Prasanna |
ఈ దుంప గురించి తెలుసా? వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం  ఇదేనట
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీరాముడు వనవాస సమయంలో తన సతీమణి సీత, సోదరుడు లక్ష్మణునితో పద్నాలుగేళ్ల పాటు అడవిలోనే జీవించాడు. ఆ సమయంలో రాముడు తీసుకున్న ఎక్కువగా తీసుకున్న తిన్న ఆహారం ఇదేనట. దీన్ని ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోనే సాగు చేస్తారు. దీన్ని రామ్ కంద్ మూల్ అని పిలుస్తారు. వివిధ అనారోగ్య సమస్యలకు ఈ కందమూలాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు . ఇది ఆరోగ్యకరమైనది కూడా. వనవాసంలో ఉన్న శ్రీరాముడు ఈ కందమూలాన్ని తినడం వల్లనే ఆరోగ్యవంతుడిగా ఉన్నారని మన పెద్దలు చెబుతుంటారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడమే కాదు కీళ్ల వాపును కూడా తగ్గిస్తుంది.

Advertisement

Next Story