Strong tea: స్ట్రాంగ్ టీ తాగే అలవాటు మీకు ఉందా..? అయితే, సమస్యే..!

by Kanadam.Hamsa lekha |
Strong tea:  స్ట్రాంగ్ టీ తాగే అలవాటు మీకు ఉందా..? అయితే, సమస్యే..!
X

దిశ, ఫీచర్స్: ఒక కప్పు టీ తాగడం వల్ల రోజంతా ప్రశాంతంగా, మెదడుకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. టీని చాలామంది ఇష్టపడుతుంటారు. ఆఫీసు పనులతో అలసిపోయినప్పుడు, ఇంటి పనుల విషయంలో ఆందోళన కలిగినప్పుడు.. ఇలా ప్రతీ విషయంలో ఒత్తిడి కలిగినప్పుడు గుర్తొచ్చేది టీ మాత్రమే. ఈ టీని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొందరు మాములు టీ కాకుండా స్ట్రాంగ్‌ టీ తాగుతుంటారు. టీని స్ట్రాంగ్‌గా చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దానిని ఎక్కువసేపు మరింగించాల్సి వస్తుంది. ఇలా ఎక్కువసేపు మరిగించిన టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యలు వస్తాయి:

టీ అంటే ఇష్టం ఉన్న వారు రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తాగేస్తుంటారు. కొందరు స్ట్రాంగ్‌ టీని ఇష్టపడే వారు కూడా నాలుగు సార్లు తాగుతుంటారు. పాలతో చేసిన టీని ఎక్కువ సమయం మరిగించడం వల్ల శరీరంలో ఐరన్ పోషణకు ఆటకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు టీని మరిగించడం వల్ల పాలలో ఉండే విటమిన్ బి12, సి వంటి కొన్ని పోషకాలు క్షీణిస్తాయి. అంతేకాకుండా ఈ టీని ప్రతిసారి తాగడం వల్ల కాలేయం, గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

టీని పదే పదే వేడి చేసి, దానిని తాగితే, టానిన్లు అధికంగా విడుదల అవుతాయి. ఇది రక్తపోటును అధికం చేస్తుంది. అందువల్ల హైబీపీ ఉన్న వారు స్ట్రాంగ్ టీని తాగడం ఆరోగ్యానికి అంత మంచి కాదు. స్ట్రాంగ్ టీని ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లైతే.. ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద టీను మరిగిస్తే లాక్టోస్ పాలలోని ప్రోటిన్లతో చర్య జరుపుతుంది. కాటెచిన్స్, ఫాలీఫెనాల్స్ వంటి సాల్యుటరీ మిశ్రమాలు విచ్ఛిన్నమవుతాయి. దీని వల్ల ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు తగ్గిపోతాయి. అందులో ఎసిడిటీ గుణం ఎక్కువగా పెరిగి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడమే మంచిది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed