ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని పిల్లలకు అధిక మొత్తంలో ఇవ్వకండి..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-05 11:45:57.0  )
ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని పిల్లలకు అధిక మొత్తంలో ఇవ్వకండి..!
X

దిశ, ఫీచర్స్: అమృతం విషంగా మారుతుందనే సామెత ఒకటి ఉంది. అదేవిధంగా ఆహార విషయంలో కూడా ఎన్ని పోషకాలు ఉన్నా మితంగా తీసుకోవాలని, అధికంగా తీసుకుంటే ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు సూచించారు. డ్రై ఫ్రూట్స్, తృణ ధన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా బాదంప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి అనేక విధాలుగా సహాయపడుంది. వీటిని పిల్లలకు తినిపించడం వల్ల ఆరోగ్యంతోపాటు తెలివితేటలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

బాదంపప్పులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని ఎన్ని తినాలి అనే విషయంపై గందరగోళం నెలకొంది. ముఖ్యంగా పిల్లలకు బాదం ఎంత ఇవ్వాలో తెలుసుకోవాలి. ఇది పిల్లల పోషకాహారంలో అంతర్భాగమైనప్పటికీ తల్లిదండ్రులు వాటిని ఎన్ని ఇవ్వాలో తెలుసుకోవాలి.

పిల్లలకు బాదంపప్పు ఎంత మోతాదులో ఇవ్వాలి:

* 1 నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు 3 బాదంపప్పులు ఇవ్వాలి.

* 4-7 ఏళ్ల పిల్లలకు 5-7 బాదంపప్పులు.

* 9 సంవత్సరాలుపైబడిన వారికి 8-10 బాదంపప్పులు సరిపోతాయి.

అయితే, చిన్నపిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లైతే బాదంపప్పు ఇచ్చే ముందు పిల్లల వైద్యుల సలహా తీసుకోవడం మంచింది.

ఎక్కువగా తింటే ఏమవుతుంది..?

ఏదైనా ఆహారాన్ని అధికంగా తీసుకుంటే, దాని దుష్ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే బాదంను ఎక్కువగా తింటే ఎదురయ్యె సమస్యల గురించి తెలుసుకోండి.

జీర్ణ సమస్యలు: బాదంలో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. కానీ, వాటిని అధికంగా తిని.. నీరు తాగకపోతే కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

బరువు పెరగటం: బాదంలో హెల్తీ ఫ్యాట్స్‌తో పాటుగా క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed