పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేయకూడదు!

by Anjali |   ( Updated:2023-06-29 06:16:00.0  )
పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేయకూడదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆషాడమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తొలి ఏకాదశి పండుగ ఈ ఏడాది జూన్ 29(గురువారం)న వచ్చింది. తొలి ఏకాదశిని ఎందుకు ఇంత పవిత్రంగా కొలుస్తారో, ఈ రోజున ఏలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి ఏకాదశి అనే కన్య ఉద్భవిస్తుంది. ఆమె విష్ణుమూర్తిని 3వరాలు కోరుకుంటుంది. 1. ఒకటి తాను సదా విష్ణుమూర్తికి ప్రియంగా ఉండాలి. 2. అన్ని తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి. 3. ఏకాదశి తిథి నాడు భక్తితో ఉపవాసం ఉండి.. పూజించిన వారికి మోక్షము లభించాలని కోరుతుందట.

అయితే ఈ పండగ రోజున సూర్యోదయానికి ముందే లేచి తాను శుద్ధి చేసుకుని ఇంటిని శుభ్రం చేసి తరువాత శ్రీహరిని నియమ భక్తితో పూజించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, వండిన ఆహారము, చింతపండు ఉసిరి ఉలవలు, మినుములతో చేసినవి ఆహారంగా తీసుకోవద్దు. మంచంపై నిద్ర చేయకూడదు. ఇలా చేయడం వల్ల మరణాంతరం వైకుంఠానికి వెళ్తారని పూర్వీకులు చెప్పేవారు. ఈ రోజును విశిష్టమైన రోజుగా అనడానికి ముఖ్య కారణం ఏంటంటే? అన్నంలో దాగిన పాప పురుషుడు, బ్రహ్మ చమట బిందువు నుంచి అవతరించిన రాక్షసుడు తనకి నివసించడానికి ప్రదేశం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజు భోజనం చేసేవారి భోజనంలో నివసించమని వరం ఇస్తాడు. అందుకే ఆ రోజు భోజనం చేయడం అనారోగ్య హేతువని పూర్వీకులు చెప్తుంటారు.

Read More: చెవిలో వెంట్రుకలు ఉంటే, అదృష్టమా.. దురదృష్టమా?

Advertisement

Next Story