- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Diabetes : శరీరంలో ఈ లక్షణాలు ప్రమాదకరం.. ఏం చేయాలంటే..
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో డయాబెటిస్ సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ రిలేటెడ్ వర్క్, ఫ్యామిలీ హిస్టరీ వంటివి ఇందుకు కారణం అవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగిపోవడం పెరిగిపోవడంవల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అప్పుడు తగినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రమాదకర లక్షణాలను గుర్తించి వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.
* అధిక దాహం : రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం కారణంగా, అవి శరీరంలోని అదనపు గ్లూకోజ్‌ను మూత్రంలోకి చేరేలా పనిచేస్తాయి. అలాగే రక్తం ద్వారా నీటిని గ్రహిస్తాయి. దీంతో బాడీ డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఫలితంగా దాహం ఎక్కువగా వేస్తుంది.
* ఆకలి ఎక్కువ కావడం: షుగర్ బాధితుల్లో శరీర కణాలకు తగినంత గ్లూకోజ్ అందనప్పుడు రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఎనర్జీ లేకపోవడంవల్ల దానిని పొందడానికి మెదడు ఆకలి సంకేతాలను పంపుతుంది. దీంతో విపరీతమైన ఆకలి వేస్తుంది. అలా ఎవరికైనా జరుగుతుందంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవచ్చు.
* అధిక మూత్ర విసర్జన : డయాబెటిస్ పేషెంట్లలో యూరిన్ అదనపు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయాలంటే కిడ్నీలకు మరింత అధిక నీరు అవసరం అవుతుంది. ఈ కారణంగా వారు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
* బరువు తగ్గడం : శరీరంలోని కణాలు సరిపడా గ్లూజ్‌ను పొందలేని పరిస్థితిలో శరీరం ఎనర్జీ కోసం కొవ్వును, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా వేగంగా బరువు తగ్గుతారు.
* కాళ్లు, చేతుల్లో తిమ్మిరి : రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగిన పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే నరాలు దెబ్బతింటాయి. దీనినే డయాబెటిక్ న్యూరోపతిగా నిపుణులు పేర్కొంటారు. ఈ సమయంలో ఒళ్లు జలదరింపునకు, తిమ్మిరికి, నొప్పికి గురవుతుంది. కూర్చున్నా లేచినా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతుంటాయి.
* అధిక అలసట : బాడీలో తగినంత ఇన్సులిన్ లేకపోవడంవల్ల రక్త ప్రవాహంలో మార్పులు వస్తాయి. ఇక్కడ కణాలకు బదులుగా గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాధితులు అధిక అలసటకు గురౌతారు. నీరసం ఆవహిస్తుంది.
* చూపు మసకబారడం : హై బ్లడ్ షుగర్ లెవల్స్ ఉన్నప్పుడు లెన్స్‌లోకి ఫ్లూయిడ్‌ను లాగుతూ ఉంటాయి. దీనివల్ల కంటి లెన్స్ షేపులో మార్పులు వస్తుంటాయి. ఫలితంగా కంటి చూపు మందగిస్తుంది. క్రమంగా రెటీనాలోని రక్త నాళాలపై ఎఫెక్ట్ పడుతుంది.
* గాయాలు మానకపోవడం : షుగర్ బాధితుల్లో ఎలివేటెడ్ గ్లూకోజ్ లెవల్స్ రక్త ప్రవాహాన్ని, ఇమ్యూనిటీ సిస్టం పనితీరును దెబ్బతీస్తాయి. దీంతో పుండ్లు ఏర్పడినప్పుడు గాయాలు మానకపోవడం, అంటువ్యాధుల రిస్క్ పెరగడం, స్కిన్ అలెర్జీలు వంటివి సంభవిస్తుంటాయి.
* ఈ జాగ్రత్తలు ముఖ్యం : మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే హార్ట్ ఇష్యూస్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, కంటిచూపు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ షుగర్ లెవల్స్ సరైన స్థాయిలో మెయింటైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి వారానికి కనీసం150 నిమిషాలు వ్యాయామం లేదా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలి. అట్లనే షుగర్ రిఫైన్డ్ కార్బో హైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తగ్గించాలి. వైద్య నిపుణుల సలహాలు తప్పకుండా పాటించాలి.