- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడి మహిళలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చు.. అత్యంత సురక్షితమైన దేశం కూడా అదే
దిశ, ఫీచర్స్ : స్వేచ్ఛ, సమానత్వ హక్కులు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మహిళలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేక దేశాల్లో సగటు మహిళ ఒంటరిగా తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒకే ఒక్కదేశంలో ఆ పరిస్థితి లేదని, అక్కడ మహిళలు సేఫ్‌గా ఫీలవుతారని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, పిల్లల్ని కనడం, కనకపోవడం ఇలా అనేక అంశాల్లో స్త్రీలు సొంత నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. ‘విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ - 2023’ నివేదిక కూడా ఆ దేశం మహిళలకు అంత్యంత సురక్షితమైందని ప్రకటించింది. అదే డెన్మార్క్.
భద్రతలో ఢోకా లేదు
స్త్రీలకు అవసరమైన భద్రత, సమానత్వం, శాంతి, సంతోషం వంటివి ఇచ్చే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది డెన్మార్క్ మాత్రమేనని నిపుణులు చెప్తున్నారు. టోటల్ 176 దేశాల్లో మహిళల భద్రతపై ర్యాంకులను పరిశీలిస్తే ఇది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక భారత్ 128వ స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, లగ్జెంబర్గ్ దేశాలు ఉన్నాయి. జింబాబ్వే, నమీబియా, అంగోలా వంటి దేశాలు స్త్రీ స్వేచ్ఛ, భద్రత విషయంలో భారత్ వెనుకబడి ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎందుకని అంత ప్రత్యేకం
మహిళల విషయంలో డెన్మార్క్ ఎందుకంత ప్రత్యేకంగా నిలిచిందంటే.. ఇక్కడ అన్ని విధాలా స్వేచ్ఛ, సౌకర్యాలు కల్పించారు. బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు ఉండవు. రేపులు, దౌర్జన్యాలు, పెత్తనాలు అస్సలే లేవు. ఒక స్త్రీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి?, ఎంతమందిని కనాలి? అనేది సొంతంగా నిర్ణయించుకుంటుంది తప్ప ఇందులో ఎవరి జోక్యమూ ఉండదట. పైగా ఇక్కడి మహిళలకు వారి జీవితం మీద పూర్తి సాధికారత ఉంటుంది. వారు తమకు నచ్చినట్లుగా జీవించగలరు.
చిన్నప్పటి నుంచే అలా..
డెన్మార్క్‌లో స్త్రీలపట్ల వివక్ష, అసమానతలు ఎందుకుండవంటే ఇక్కడ చిన్నప్పటి నుంచే, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో స్త్రీ, పురుషులు సమానం అనే భావజాలాన్ని వివిధ సూక్తుల ద్వారా బోధిస్తుంటారట. ఇక ఉద్యోగాల్లోనూ స్త్రీ, పురుషులకు సమాన హక్కులు, సమాన వేతనాలు అమలు చేస్తారు. ప్రపంచంలో అధికంగా 72 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్న దేశంగా డెన్మార్క్ గుర్తింపు పొందింది.
పెళ్లి, పిల్లల విషయంలో నిర్ణయం
డెన్మార్క్‌లో స్త్రీల విషయంలో కట్టుబాట్లు, బలవంతంగా పాటించే ఆచార సాంప్రదాయాలు లేవు. పెళ్లి, జీవితం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఇక్కడి స్త్రీలు పెళ్లి కాకుండానే సహజీవనం చేయవచ్చు. తమకు ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కనే హక్కును కలిగి ఉన్నారు. 1960వ దశకం నుంచే ఈ దేశంలో సహజీవనం, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనే హక్కును చట్టబద్ధం చేశారు. మరో విషయం ఏంటంటే.. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పిల్లల బాధ్యత మాత్రం స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగా ఉంటుంది. ఇక్కడ నమ్మి మోసపోయారనే సమస్యలే తలెత్తవట. జెండర్ ఈక్వాలిటీనే కాకుండా అన్ని విషయాల్లోనూ స్త్రీ, పురుష సమానత్వం వర్ధిల్లుతున్న దేశంగా ఇప్పుడు డెన్మార్క్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ దేశ పార్లమెంటులోనూ 43 శాతం మంది మహిళలు ఉండగా, అందులో 5 శాతం మంది మంత్రులుగా ఉన్నారు.
Read More..
వామ్మో.. అంతపెద్దదా..? ప్రపంచంలోనే అత్యంత పొడవైన పురుషాంగం.. (వీడియో)