- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపు రాని వారి కోసం కాలేజ్ .. ఎలా ఏడవాలో శిక్షణ!
దిశ, వెబ్డెస్క్ : ఎప్పడూ ఏడ్చేవాళ్లని ఏడుపు గొట్టు మొఖాలు అంటారు. మన దేశంలో నిత్యం ఏడ్చేవాళ్లని ఒక రకంగా చూస్తారు. ఏదైనా పని మీద వెళ్లే టప్పడు ఏడిస్తే ఆ పని కాదని చాలా మంది నమ్ముతారు. కానీ నిజానికి ఏడ్చే వారు ఎంతో అదృష్టవంతులని చాలా మందికి తెలియదు. బాధను దిగమింగుకొని బయటికి నవ్వుతూ ఉండే వారు ఎప్పటికైనా ప్రమాదంలో పడతారని రుజువైంది. ఏడ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపితమైంది. నిత్యం ఏడ్వడం వల్ల అనేక రోగాల నుండి బయటపడతారంట.
ఏడుపు వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజం పొంది రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందట. కానీ ఒకే సారి ఎక్కువ సమయం ఏడ్చకూడదట. అలా చేస్తే నీరసం వచ్చి మంచానపడతారు. ఏడ్వడం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఏడ్చినప్పడు వచ్చే కన్నీళ్లకి కూడా ఎంతో శక్తి ఉంటుందని తేలింది. ఉద్వేకంతో ఏడ్చినప్పడు వచ్చే ఒక్క చుక్క కన్నీరైనా ఎంతో శక్తివంతమైనదని అధ్యయనాల్లో తేలింది. మరో విషయం తెలుసా బోరున ఏడ్చే సమయంలో తనలోని అంతర్గతంగా ఉన్న మరో మనిషి బహిర్గతం అవుతారు. అందుకే చాలా మంది ఏడ్చే సమయంలో చిన్నపిల్లాడిలాగానో, అమాయకుడిలాగానో కనిపిస్తారు.
ఏడిపించే కాలేజీ కూడా ఉంది తెలుసా...
ఈ విషయం చెబితే ఎవ్వరూ నమ్మరు. ఏడిపించేందుకు ఫీజులు కట్టి కాలేజీలో చేరుతారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి కాలేజీ జపాన్లో ఉంది. నిజానికి జపాన్ ప్రజలు చాలా సుకుమారులంట. వారు చిన్న విషయానికి కూడా ఏడ్చే స్వభావం గలవారంట. కానీ కొందరు ఎంతకీ ఏడ్వని వారు ఉన్నారంట. అలాంటి వారు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఏడుపుగొట్టు కాలేజీలో చేరతారు.
ఫీజులు కట్టి మరీ ఏడ్వటానికి కాలేజీలో చేరతారు. వీరు ఓ పట్టాన ఏడ్వకపోవడంతో కాలేజీ అధ్యాపకులు నానా తంటాలు పడి ఏడిపిస్తారు. విచిత్రంగా ఉంది కదూ. ప్రస్తుతానికి మన దేశంలో నవ్వడానికి కొన్ని చోట్ల సెంటర్లు ఉన్నాయి. అలాగే భవిష్యత్లో మన కాడ కూడా ఏడ్చే కాలేజీలు వస్తాయేమో వేచి చూద్దాం.
ఇవి కూడా చదవండి:
భార్య భర్తలు గొడవలు పెట్టుకోవడంలో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?