Motivational : చాలా సమస్యలకు అదే కారణం.. కమ్యూనికేషన్ గ్యాప్‌తో తలెత్తే ఇబ్బందులివే..

by Javid Pasha |   ( Updated:2024-11-16 09:18:21.0  )
Motivational : చాలా సమస్యలకు అదే కారణం.. కమ్యూనికేషన్ గ్యాప్‌తో తలెత్తే ఇబ్బందులివే..
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ మంచిగానే అనిపించే వ్యక్తిలో ఇప్పుడన్నీ లోపాలే కనిపిస్తున్నాయా? అవతలి వ్యక్తి కూడా ప్రతీది తప్పుగానే అర్థం చేసుకుంటున్నారా? మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌కు నిదర్శనం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అనేక విషయాల్లో మిస్ అండర్‌స్టాండ్‌కు అదే కారణం అవుతోంది. మనస్పర్థలకు దారితీసస్తోంది. సంబంధాలను నిర్వీర్యం చేస్తోంది. అందుకే సరైన కమ్యూనికేషన్ కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.

చిన్న నిర్లక్ష్యమే పెద్ద సమస్యగా..

చాలా మంది చిన్న సమస్యే అనుకుంటారు. అలాగనీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ చివరికి పెద్ద ప్రాబ్లంగా మారవచ్చు అంటున్నారు నిపుణులు. క్రమంగా ఇది మానవ సంబంధాలపైనా, వ్యక్తిగత, కుటుంబ, వృత్తి జీవితాలపైనా ప్రభావం చూపుతుంది. అందుకే దానిని నివారించాలంటున్నారు మానసిక నిపుణులు. సరైన కమ్యూనికేషన్ కలిగి ఉన్నప్పుడే అనుమానాలు, సందేహాలు, మనస్పర్థలకు అవకాశం ఉండదు. మనసులోని ఫీలింగ్స్ బయటకు చెప్పకుండా బాధపడే పరిస్థితి ఉండదు. అలా చేయడంవల్ల తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా రాదు.

ప్రయత్నం వల్లే ఫలితం

మీరు సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఉండాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అది ప్రయత్నించకపోతే అస్సలు రాదు. అవతలి వ్యక్తులే అర్థం చేసుకుంటారు లే అనుకుంటే సమస్య మరింత జఠిలం కావచ్చు. ఎందుకంటే మీ మనసులో ఏముందే మీరు చెప్పకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరేం అనుకుంటున్నారో అది చెప్పేసేయండి. సంతోషం, బాధ, సమస్య ఇలా ఏదైనా సరే బయటకు చెబితేనే కదా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేది. కాబట్టి మీలో కమ్యూకేషన్ గ్యాప్ లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లం వంటివి గుర్తిస్తే మరు క్షణం నుంచే వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు.

ఎందుకంత ముఖ్యం?

జస్ట్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కదా అనుకోవడానికి లేదు. ఈ చిన్నపాటి నిర్లక్ష్యమే మీ వృత్తి జీవితాన్ని తారుమారు చేయవచ్చు. మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, పరస్పర అవగాహన పెంపొందించుకోవడంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని గుర్తించండి. అది సరిగ్గా ఉన్నప్పుడే మనుషుల మధ్య నమ్మకం పెరుగుతుంది. లైఫ్ పార్ట్‌నర్స్ మధ్య మరింత సాన్నిహిత్యానికి దారితీస్తుంది. అలా జరగకూడదంటే సరైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.

శ్రద్ధగా వినడం ముఖ్యం

కారణాలేమైనప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా నష్టపోతారని నిపుణులు చెబుతున్నమాట. ఇటు ఫ్యామిలీ పరంగా, అటు ప్రొఫెషనల్‌గానూ సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి చెప్పేది మధ్యలోనే కట్ చేయడం గానీ, విషయాన్ని అర్థం చేసుకోకుండానే అర్థమైందని చెప్పడం గానీ చేయకండి అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే అవతలి వ్యక్తి మరోసారి మీకు ఏదీ సరిగ్గా చెప్పరు. చెప్పినా వినరనే ఉద్దేశంతో ముఖ్యమైన విషయాలను కూడా పంచుకోరు. కొన్నిసార్లు అవతలి వ్యక్తి చెప్పేవి మీ వృత్తి జీవితానికి ముఖ్యమైనవి అయి ఉండవచ్చు లేదా మీ సంబంధాలను మెరుగు పర్చే విషయాలు కావచ్చు. ఒక్క కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇవన్నీ నష్టపోతారు. సో శ్రద్ధగా వింటే ఆ ప్రాబ్లమే ఉండదు.

బాడీ లాంగ్వేజ్ కూడా..

మీ ప్రవర్తన, మీ బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, హావ భావాలు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడటానికి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఇవన్నీ అవతలి వ్యక్తిని భయపెట్టేవిగానో, అసహ్యం కలిగించేవిగానో ఉంటే వారు మీతో ఐడియాలను, సమస్యలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. క్రమంగా కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఇది పెద్దదై మీ ఉద్యోగ జీవితాన్ని, వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. తప్పుగా అర్థం చేసుకోవడంవల్లో, సరైన సమాచారం లేకపోవడంవల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. రిలేషన్ షిప్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ మీలో మానసిక ఆందోళనకు, తద్వారా ఇంకా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి అన్నింటికీ చక్కటి పరిష్కారం సరైన కమ్యూనికేషన్ మాత్రమే.

Advertisement

Next Story

Most Viewed