పెద్ద వయసు ఉన్న మహిళతో మైనర్ సహజీవనం చట్టబద్ధం కాదు

by sudharani |   ( Updated:2023-08-03 06:43:59.0  )
పెద్ద వయసు ఉన్న మహిళతో మైనర్ సహజీవనం చట్టబద్ధం కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో లైంగిక సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఎవరితో పడితే వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టులు కొన్ని కేసులను ఆధారంగా చేసుకుని స్పష్టమైన చట్టాలను ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇక తాజాగా మరో కీలక విషయాన్ని అలహాబాద్ కోర్ట్ ప్రజలకు తెలిసేలా చేసింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది.

18 ఏళ్ల లోపు ఉన్నవారు సహజీవనం చేయడం చట్టవిరుద్ధమని, అనైతికమని ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అంతే కాకుండా 18 ఏళ్ల లోపు అబ్బాయి.. తనకంటే వయసులో పెద్దవారైన అమ్మాయితో సహజీవనం చేయడం చట్ట విరుద్ధం అని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులకు ఇష్ట పూర్వకంగా జీవించే హక్కు ఉందని, కానీ వారు మేజర్లై ఉండాలని ధర్మాసనం పేర్కొంది.

Read More : ప్లీజ్ ఆంటీ నేను తట్టుకోలేను.. నన్ను పెళ్లి చేసుకో.. సురేఖవాణికి ప్రపోజ్ చేసిన యువకుడు (వీడియో)

Advertisement

Next Story

Most Viewed