Cocaine Sharks : గంజాయి తింటున్న సొర చేపలు.. డ్రగ్ ఎక్కడ తీసుకుంటున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Sujitha Rachapalli |
Cocaine Sharks : గంజాయి తింటున్న సొర చేపలు.. డ్రగ్ ఎక్కడ తీసుకుంటున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్: పవర్ ఫుల్ షార్క్ వెంటాడి, వేటాడి చంపేస్తుంది. ఒక్కసారిగా మనిషిని మింగేస్తుంది. అయితే అసలే కోతి.. కల్లు తాగితే పరిస్థితి ఏంటి? అన్నట్లుగా.. అసలే షార్క్ పైగా గంజాయి తింటే ఎలా ఉంటుంది? అదేంటి అనుకుంటున్నారా? కానీ అదే జరిగింది. షార్క్ కొకైన్ తింటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్ తీరంలోని రియో డి జనీరో సమీపంలోని నీటి నుంచి 13 బ్రెజిలియన్ షార్ప్‌నోస్ సొరచేపలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్న సముద్ర జీవశాస్త్రవేత్తలు.. వాటి కండరాలు, కాలేయాలలో అధిక స్థాయిలో కొకైన్‌ కనుగొన్నారు.

అయితే ఈ సొర చేపలు కొకైన్ ఎలా తింటున్నాయో తెలియనప్పటికీ.. కొకైన్ ఔషధాలను ఉత్పత్తి చేసే ల్యాబ్‌ల డ్రైనేజీ నుంచి లేదా డ్రగ్స్ వినియోగదారుల విసర్జనతో కూడిన మురుగు నీటి నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు సముద్రంలో పడేసిన కొకైన్ కట్టలను కూడా తిని ఉండొచ్చని అనుకుంటున్నారు. కాగా ఈ చేపలు చాలా కాలంగా ఇది తింటున్నట్లు తెలిపిన శాస్త్రవేత్తలు.. 92 శాతం కండరాల నమూనాలు, 23 శాతం కాలేయ నమూనాలు డ్రగ్‌లోని బెంజాయిలెక్‌గోనైన్‌కు పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. మెదడు పనితీరును ప్రభావితం చేయడంతోపాటు కంటి చూపును దెబ్బతీయడం, వేటాడే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story