చేప గుడ్లతో తయారయ్యే క్లాస్ట్లీ వంటకం.. ఒక ప్లేట్‌ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

by Anjali |
చేప గుడ్లతో తయారయ్యే క్లాస్ట్లీ వంటకం.. ఒక ప్లేట్‌ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అనేక మంది అనేక రకాల ఆహారపదార్థాల్ని ఇష్టపడుతుంటారు. అందులో కేవియర్ ఒకటి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ కేవియర్ ముత్యల్లా మెరిసిపోయే ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుని నములుతుంటే గుడ్లు పగిలిపోతుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫుడ్ ప్రపంచంలోని పలు దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కేవియర్ కాస్పియన్ సముద్రం.. నల్ల సముద్రంలో కనిపించే అడవి స్టర్జన్ గుడ్లు. పాడిల్ ఫిష్, సాల్మన్, ట్రౌట్, కార్ప్ వంటి స్టర్జన్ జాతుల నుంచి తయారవుతాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారాల్లో కేవియర్ ఒకటి. ఇండియాలో దీని ధర కేవలం 30 గ్రాములకే రూ. 8000 నుంచి 18000 రూపాయల వరకు ఉంటుంది. చేపల స్వచ్ఛతను బట్టి దీని విలువ నిర్ణయిస్తారు. ఎందుకు కేవియర్ ధర ఇంత ఎక్కువగా ఉంటుందంటే.. ఆడ స్టర్జన్ పెద్ద సంఖ్యలో గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. కానీ ఇవి ప్రొడక్టవ్ చేయడానికి 15 నుంచి 18 సంవత్సరాల సమయం పడుతుంది. గతంలో వీటి గుడ్లను స్టోర్ చేయడానికి ఆడ ఫిష్‌లను చంపేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో చేపలు గర్భవతిగా ఉన్న టైంలో అవి అపస్మారక స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో చేపల కడుపు నుంచి గుడ్లను తీస్తారు. చేపలను మళ్లీ సంతానోత్పత్తికి వదిలిపేడతారు. ఒకప్పుడు కేవియర్ పేదల ఆహారంగా చెప్పుకునేవారు. కేవియర్‌ను అప్పట్లో రష్యన్ మత్స్యకారులు రోజూ.. వారి భోజనంలో భాగం చేసుకునేవారట.

Advertisement

Next Story

Most Viewed