- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనా స్కూల్లో మెగాస్టార్‌పై ప్రజెంటేషన్.. చప్పట్లతో అభినందించిన స్టూడెంట్స్
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. అతనికి పిల్లలు మొదలు పెద్దల వరకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ జనరేషన్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో నిరూపించుకుంటున్న విలక్షణ నటుడు మన మెగాస్టార్. రీసెంట్‌గా చైనాలో జరిగిన ఓ సంఘటన మరోసారి అతని క్రేజ్ ఎంటో చూపించింది. బీజింగ్ దగ్గరలోని ‘జంజు 26’ అనే గవర్నమెంట్ మోడల్ స్కూల్ స్టూడెంట్స్‌ను మీకు నచ్చిన ఇన్ స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలని అక్కడి టీచర్లు అసైన్‌మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా 7వ తరగతి చదువుతున్న జస్మిత అనే స్టూడెంట్ మెగాస్టార్ గురించి చెప్పుకొచ్చింది. అయితే భారతీయుల గురించి చెప్పడానికి అనుమతిలేకపోవడంతో చిరంజీవి ఎవరు? అని అడిగిందట టీచర్. దీంతో సదరు స్టూడెంట్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి చిరంజీవిని చూపిస్తూ బిగ్గెస్ట్ ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ ఇతనే అని చెప్పిందట. అది విన్న టీచర్ చిరంజీవి గురించి చెప్పడానికి పర్మిషన్ ఇవ్వగా, జస్మిత 5 నిముషాల ప్రజెంటేషన్ ఇచ్చింది. కెరీర్‌లో చిరంజీవి ఎదిగిన వైనం, కష్టపడి మెగాస్టార్ స్థాయికి చేరుకున్న పరిస్థితులు వివరించడంతో మిగతా స్టూడెంట్స్ జస్మితను చప్పట్లతో అభినందించారు.