- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజితో మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా చేస్తే సరిపోతుంది!!
దిశ, ఫీచర్స్: ఉరుకుల పరుగుల ప్రపంచంలో.. ప్రతి పనికి మానవుడు మిషన్‌లకు అలవాటు పడిపోయాడు. తినడానికి తిండి లేకున్నా అప్పు చేసి మరి వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటి పనులు స్వయంగా చేసుకొవడం మానేశారు. దాదాపు అందరూ కుక్కర్‌లోనే వంటలు చేస్తున్నారు. కానీ, పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రల్లో ఉడికించి గంజిని వడ పోసేవారు.. అలా తీసిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగేవాళ్ళు. ఇలా తాగడం వల్ల బియ్యంలో ఉండే పోషకాలేవీ బయటకు పోకుండా శరీరానికి మంచి శక్తిని ఇచ్చేది. అయితే.. కాలక్రమేణా గంజిని పక్కన పెట్టేశారు. కానీ దీని వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే.. మీరూ ఫాలో అయిపోతారు.
గంజితో ఆరోగ్యానికి జరిగే మేలు :
* గంజిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. ఈ గంజిలో విటమిన్ సి , విటమిన్ ఈ, విటమిన్ బి తోపాటు అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
* గంజిని సేవించడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. అలసట, నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు తొలగిపోతాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి. అందులో ఉండే అమైనో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
*చాలా మందికి అన్నంతో పాటు చివరలో పెరుగు తినే అలవాటు ఉంటుంది. అయితే సమయానికి మజ్జిగ దొరకపోతే, గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.
* అలాగే మందులతో పని లేకుండా జ్వరం వచ్చినవారు ఈ గంజి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం కావడంతో తగ్గిపోతుంది. జీర్ణక్రియ పనితీరు పెంచడానికి, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కూడా గంజి సహాయపడుతుంది.
గంజితో చర్మానికి జరిగే మేలు:
ఈ మధ్య కాలంలో చర్మానికి చాలా రకరకాల క్రీములు, లోషన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ గంజిలో మన చర్మాన్ని కాపాడి, సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన లక్షణాలు ఉంటాయి.
*ముందుగా ఒక కాటన్ బాల్ తీసుకుని గంజిలో ముంచి ముఖచర్మం అప్లయ్ చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని ద్వారా మొటిమలు, మొటిమలు వలన ఏర్పడిన నల్లటి మచ్చలు నివారించుకోవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ ప్రభావం తగ్గి, అతినీలాలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడే శక్తి గంజిలో ఉంటుంది.
* వయసు పైబడటం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయి. ఈ గంజితో చాలా వరకు ఈ సమస్యను నివారించుకోవచ్చు. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వన చర్మాన్ని పొందవచ్చు.
గంజితో జుట్టుకు మేలు:
మనకు తెలిసి బియ్యం నీరు జుట్టుకు చాలా మంచిది. బియ్యం కడిగిన నీటితో తల స్నానం చేస్తే, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అని అంటారు.
* గంజిని జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం ద్వారా జుట్టు పట్టులా మెరుస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా జుట్టు నెరవడం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదురుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే గంజిని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తేలికపాటి షాంపూ, కండిషనర్‌తో తలస్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది.
* కెమికల్స్‌తో కూడిన షాంపూలు, కండిషనర్లు రోజు వాడుతూనే ఉంటాం. వారానికి ఒక్క రోజు ఇబ్బంది అనుకోకుండా ఈ గంజిని ఉపయోగిస్తే మంచిది.