Chanakya Niti: చాణక్యుడు చెప్పిన జీవితాన్ని నాశనం చేసే తప్పులివే!

by D.Reddy |
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన జీవితాన్ని నాశనం చేసే తప్పులివే!
X

దిశ, వెబ్ డెస్క్: ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. మౌర్యుల పరిపాలనా కాలంలో చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా ఉండి.. రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా తనదైన ముద్ర వేశారు. ఇక రాజకీయాలు, ఆరోగ్యం, వ్యాపారం, వివాహ జీవితం, సమాజం, నైతిక విలువలు, ఆర్థిక అంశాలతో పాటు జీవన విధానాలపై ఎన్నో విషయాలను చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పారు. ఇవి నేటికి ఎంతో మంది అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా జీవితాన్ని నాశనం పలు విషయాలను చాణక్యుడు వివరించారు. అవేంటో చూద్దాం.

జీవితంలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని, లేదంటే జీవితం నాశనం అవుతుందని చాణక్యుడు చెప్పారు. అలాగే, ప్రతి మనిషి తన జీవితంలో నిర్ధిష్ట లక్ష్యాలను పెట్టుకోవాలని చాణక్య నీతి శాస్త్రంలో సూచించారు. లక్ష్యం లేని జీవితం వ్యర్థం అని పేర్కొన్నారు. లక్ష్యం లేని వ్యక్తి శక్తి, సమయం రెండింటినీ వృథా చేస్తాడని అన్నారు. అలాగే, చెడు అలావాట్లు, చెడు సవాసాలు ఎప్పటికైనా జీవితాన్ని నాశానం చేస్తాయని హెచ్చరించారు. వీటికి ఎంత దూరంగా ఉండే జీవితం అంతా హాయిగా సాగిపోతుందని చెప్పారు.

ప్రతి మనిషికి ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలని చాణక్యుడు తెలిపారు. ఇతరులకు సాయం చేయకుండా స్వార్థంగా ఉండేవారు ఎప్పుడు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగరని చెప్పారు. చాణక్య నీతి ప్రకారం.. సమయానికి విలువ ఇవ్వని వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. సమయంలో పోతే తిరిగి రాదు. సమయాన్ని సరిగా వినియోగించుకునే వారు జీవితంలో సక్సెస్ అవుతారు. ఇక స్త్రీలను, పెద్దలను అగౌరవపరిచటం, ఇంట్లో గొడవలు సృష్టించే అలవాట్లు కూడా జీవితాన్ని నాశనం చేస్తాయి.

Next Story

Most Viewed