గుడ్లగూబలు పగటిపూట సరిగా చూడలేవా..?

by Aamani |   ( Updated:2023-03-24 13:40:52.0  )
గుడ్లగూబలు పగటిపూట సరిగా చూడలేవా..?
X

దిశ, వెబ్‌డెస్క్: గుడ్లగూబ పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి రాత్రిపూట తిరిగే ఒక పక్షి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవి స్ట్రిగిఫార్మిస్ జాతికి చెందినవి. వీటిలో సుమారు 200 జాతులు ఉన్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న గుడ్లగూబల్లో రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి స్ట్రిగిడే కుటుంబంలో సామాన్యమైన గుడ్లగూబలు, రెండోది టైటానిడే కుటుంబంలో బార్న్ గుడ్లగూబలు ఉన్నాయి. ఇవి ధృవప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రపంచమంతా విస్తరించాయి. దీన్ని అపశకునపు పక్షిగా భావించకుండా లక్ష్మీదేవి వాహనంగా పెద్దలు చెప్పారు. కారణం ఈ గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.

గుడ్లగూబ పగటిపూట కన్నా రాత్రిపూట బాగా చూడగలుగుతుంది. అయితే మిగతా పక్షులతో పోలిస్తే గుడ్లగూబలకు చూసే శక్తి తక్కువే. అందుకే అవి వేటాడేటప్పుడు చూసే శక్తితో పాటు వినే శక్తిని కూడా బాగా ఉపయోగించుకుంటాయి. వీటి వినికిడి శక్తి ఎంత శ్రద్ధగా ఉంటుందంటే మనుషుల చెవులకు వినిపించని ఏదైనా శబ్ధాలను ఇవి చాలా స్పష్టంగా వినగలుగుతాయి. ఆయా జంతువుల ఉనికిని తెలుసుకునేందుకు ఇవి వాటి కదలికల వల్ల పుట్టే శబ్ధాలపైన ఆధారపడడం విశేషం. తాము వేటాడదలుచుకున్న జంతువులకు ఎలాంటి అనుమానం రాకుండా నిశ్శబ్దంగా వాటిని ఫాలో అవుతూ కచ్చితంగా అవి వాటిని అందుకోగలము అనుకున్న సమయంలో మాత్రమే వాటిపై దూకడం గుడ్లగూబల ప్రత్యేకత గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తూ పొలాల్లోనూ అడవుల్లోనూ తిరిగి ఎలుకలు, మిడతలు బల్లులు, నత్తలు వంటి వాటిని వేటాడి తింటాయి ఆ విధంగా పంటలకు కీడు చేసే జీవులను తినడం ద్వారా ఇవి రైతులకు మేలు చేస్తాయి. అందుకే వాటిని రైతు నేస్తం అంటారు.

Also Read..

ఇసుక మేఘాలు ఎప్పుడైనా చూశారా? ఇక్కడ గుర్తించిన శాస్త్రవేత్తలు..

Advertisement

Next Story