- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 ఏళ్ల క్రితం శాండ్‌విచ్‌కు బదులుగా ఈ గిఫ్ట్.. ఇప్పుడు రూ.2 కోట్లకు అమ్మింది!
దిశ, వెబ్‌డెస్క్ః కొన్నిసార్లు చిన్న చిన్న పనులే పెద్ద ప్రతిఫలాన్ని అందిస్తాయి. ఇలాంటి ఓ సంఘటనే కెనడాలో చోటుచేసుకుంది. ప్రఖ్యాత జానపద కళాకారుడు మౌడ్ లూయిస్ వేసిన ఓ కెనడియన్ పెయింటింగ్ మే 17న నిర్వహించిన వేలంలో $270,000 (రూ. 2 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. 50 సంవత్సరాల క్రితం గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్‌కి బదులుగా ఐరీన్ డెమాస్ అనే మహిళ దాన్ని పొందింది. ఇప్పుడు "బ్లాక్ ట్రక్" పేరుతో ఉన్న ఈ పెయింటింగ్ దాని అసలు విలువ కంటే 10 రెట్లు ఎక్కువగా అమ్ముడైంది. ది గార్డియన్ నివేదిక ప్రకారం, ఈ పెయింటింగ్ 1973లో ఐరీన్ డెమోస్ చేతికి వచ్చింది. ఆ సమయంలో ఐరీన్ తన భర్తతో పాటు ఒక రెస్టారెంట్లో చెఫ్‌గా పనిచేస్తోంది. ఐరిన్, ఆమె భర్త కలిసి జాన్ కిన్నెర్ అనే కళాకారుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం, గ్రిల్డ్ శాండ్‌విచ్‌లకు బదులుగా కిన్నెర్, అతని స్నేహితుల దగ్గరున్న చిత్రాలను వీళ్లు తీసుకోవచ్చు. అలా 1973లో ఒకరోజు, కిన్నెర్ తన దగ్గరున్న మౌడ్ లూయిస్ పెయింటింగ్స్ తీసుకొచ్చాడు. అప్పుడు వీళ్లు "బ్లాక్ ట్రక్" పెయింటింగ్‌ను తీసుకున్నారు.
నిజానికి, అంత గొప్ప ఆర్టిస్ట్ అయిన మౌడ్ లూయిస్ తన జీవితాంతం పేదరికంతోనే బతుకీడ్చింది. కెనడాలోని నోవా స్కోటియాలో రోడ్డు పక్కన ఆమె పెయింటింగ్స్‌ను అమ్మేవారు. తన మరణం తర్వాతే ఆమె గొప్పతనం ప్రపంచానికి తెలియడం విచారించదగ్గ విషయం. లూయిస్ 1970లో మరణించారు. 2016లో 'మౌడీ' అనే పేరుతో ఒక సినిమా తీసిన తర్వాత ఆమె సిగ్నేచర్ స్టైల్ గుర్తింపు పొందింది. అయితే, లూయిస్ పెయింటింగ్‌లను అప్పట్లో కిన్నెర్ విక్రయించేవారు. ఈ పెయింట్స్ సరఫరా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ లూయిస్ రాసిన లేఖలు కూడా ఇటీవల వేలం వేశారు. చేతితో వ్రాసిన ఈ 3 లేఖలు అంచనా కంటే చాలా ఎక్కువగా 70,000 కెనడా డాలర్స్ పొందడం విశేషం.