- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగ్నిపర్వతాలు, భూకంపాలను ముందుగానే గుర్తిస్తున్న చెట్లు.. ఎలా వార్నింగ్ ఇస్తాయో తెలుసా?
దిశ, ఫీచర్స్ : అకస్మాత్తుగా సంభవించే అగ్ని పర్వతాలు, భూకంపాల విస్ఫోటనంవల్ల ప్రాణహాని పొంచి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఇటువంటి విపత్తులు సంభవించే ప్రాంతాలకు దగ్గరగా నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే ఈ వోల్కానిక్ యాక్టివిటీస్ ఎలా సంభవిస్తాయి?.. ఇది తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇప్పటివరకైతే సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నారు. కానీ ఇక నుంచి మొక్కలు లేదా చెట్లపై ఆధారపడి కూడా అగ్నిపర్వతాలు సంభవించడాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉందని ఒక అధ్యయనం పేర్కొన్నది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆయా ప్రాంతాలలోని మొక్కల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంవల్ల అగ్నిపర్వత ప్రమాదాల నివారణలో గేమ్-ఛేంజర్‌గా మారవచ్చునని మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ బోగ్ నేతృత్వంలోని పరిశోధకులు కనుగొన్నారు.
స్టడీలో భాగంగా రీసెర్చర్స్ యూఎస్‌లోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కును పరిశీలించారు. 1984 నుంచి 2022 మధ్య కాలంలో ఇక్కడ నమోదైన శాటిలైట్ డేటాను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ప్యాటెర్న్‌ను అబ్జర్వ్ చేశారు. ఏంటంటే.. వోల్కానిక్ యాక్టివిటీస్‌కు ముందు ఉన్న పచ్చని వృక్షసంపదగల ప్రాంతంలోని భూగర్భంలో ఏదో అలజడి సంభవించిన సంకేతాలు, చెట్ల గుసగుసలాడుతూ కదిలే శబ్దాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. వోల్కానిక్ యాక్టివిటీస్ సంభవించే ముందు కార్బన్ డయాక్సైడ్ యొక్క జెకిల్ అండ్ హైడ్ పరిస్థితులకు నిదర్శనంగా ఈ సంకేతాలు పరిచేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ప్లాంట్ బేస్డ్ ఎర్లీ వార్నింగ్ వ్యవస్థపై వారు ఫోకస్ చేయడానికి కారణం ఫిలిప్పీన్స్‌లోని తాల్ అగ్నిపర్వతం, అలాగే ఇటలీలోని మౌంట్ ఎట్నా వంటి ప్రాంతాలలో భారీ వృక్షాలవల్లే అగ్నిపర్వతాల సంభావ్యతను అంచనా వేయగలిగారు. విస్ఫోటనానికి ముందు ఇక్కడి పచ్చినచెట్లు భూగర్భంలో మండుతున్న పరిస్థితికి వ్యతిరేకంగా భిన్నమైన సంకేతాలను వెల్లడించాయని సైంటిస్టులు చెప్తున్నారు. మరిన్ని పరిశోధనలు కూడా అవసరమని పేర్కొంటున్నారు.