- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
థైరాయిడ్ Vs సంతానోత్పత్తి.. పునరుత్పత్తి హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం
దిశ, ఫీచర్స్ : ఆధునిక ప్రపంచంలో మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. అండోత్సర్గము రుగ్మతలు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, గర్భాశయ అసాధారణతలు, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాలు స్త్రీ వంధ్యత్వానికి కారణమవుతున్నాయి. పొగాకు, మద్యపానం లేదా కొన్ని విషపదార్థాలకు గురికావడం వంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రమాద కారకాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ పనిచేయకపోవడం అనేది మహిళల సంతానోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇంతకీ ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? నివారణ చర్యలు ఏంటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
హైపో థైరాయిడిజం
థైరాయిడ్ గ్రంధి.. పునరుత్పత్తి ఆరోగ్యంతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైతే, ఆ పరిస్థితిని హైపో థైరాయిడిజం అంటారు. ఇది ఋతు చక్రం, అండోత్సర్గానికి భంగం కలిగిస్తుంది. స్త్రీల గర్భధారణను కష్టతరం చేస్తుంది. ఎగ్స్ డెవలప్‌మెంట్, అండం విడుదలకు ఆటంకం కలిగిస్తుంది. విజయవంతమైన ఫలదీకరణ అవకాశాలను తగ్గిస్తుంది.
థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్
థైరాయిడ్ హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి ఇతర పునరుత్పత్తి హార్మోన్లతో సంకర్షణ చెందుతాయి. సాధారణ ఋతు చక్రాలు, అండోత్సర్గము, విజయవంతమైన గర్భధారణకు అవసరమైన సున్నితమైన హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. హషిమోటోస్ థైరాయిడిటిస్, గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ థైరాయిడ్ పనిచేయకపోవడానికి కారణమవుతాయి. ఈ పరిస్థితులలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సంతానోత్పత్తి సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. అండాశయ నిల్వలు తగ్గడంతో పాటు గర్భస్రావానికి కారణమవుతాయి.
థైరాయిడ్ వ్యాధి నిర్ధారణ, చికిత్స
థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు (TSH, T3, T4), థైరాయిడ్ ప్రతిరోధకాలను కొలిచే రక్త పరీక్షల ద్వారా సంతానోత్పత్తి సవాళ్లు లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతున్న మహిళల థైరాయిడ్ పనితీరును అంచనా వేయడం చాలా ముఖ్యం. థైరాయిడ్ రుగ్మత నిర్ధారణ అయినట్లయితే.. తగిన చికిత్స ద్వారా థైరాయిడ్ హార్మోన్ సమతుల్యతను పునరుద్ధరించవచ్చు. సంతానోత్పత్తి ఫలితాలను మెరుగుపరచవచ్చు. థైరాయిడ్ సంబంధిత సంతానోత్పత్తి సమస్యలను నిర్వహించడంలో సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (లెవోథైరాక్సిన్), యాంటీ థైరాయిడ్ మందులు, రేడియోధార్మిక అయోడిన్ థెరపీ వంటి శస్త్రచికిత్సలు ఉంటాయి. థైరాయిడ్ పరిస్థితి, సంతానోత్పత్తి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడుతాయి.
ఎదుర్కొనేందుకు చిట్కాలు..
1. మద్దతు
భావోద్వేగ మద్దతు కోసం భాగస్వామి, కుటుంబం, స్నేహితులను సంప్రదించండి. మీ భావాలు, ఆందోళనలను వారితో పంచుకోవడం ఓదార్పునిస్తుంది. ఇలాంటి సంతానోత్పత్తి, థైరాయిడ్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర మహిళలతో కనెక్ట్ అయ్యే సపోర్ట్ గ్రూప్‌లు, ఆన్‌లైన్ కమ్యూనిటీలలో చేరడం మంచిది.
2. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి
నిర్దిష్ట థైరాయిడ్ పరిస్థితి, సంతానోత్పత్తిపై దాని ప్రభావం గురించి తెలుసుకోండి. థైరాయిడ్ ఆరోగ్యం, పునరుత్పత్తి పనితీరు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల హెల్త్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, చికిత్స ప్రణాళికలో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.
3. హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌తో కమ్యూనికేషన్
ఎండోక్రినాలజిస్ట్, పునరుత్పత్తి నిపుణుడితో సహా హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌తో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకోండి. మీ ఆందోళనలను చర్చించండి. సందేహాలు అడగండి. థైరాయిడ్ పరిస్థితి, సంతానోత్పత్తి లక్ష్యాలు రెండింటినీ పరిగణించే సమగ్ర చికిత్సా విధానాన్ని చర్చించండి.
4. ట్రీట్మెంట్ ప్లాన్
మీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సూచించిన థైరాయిడ్ మందులు, చికిత్స ప్రణాళికకు కట్టుబడి ఉండండి. టైమ్ ప్రకారం థైరాయిడ్ మందులు తీసుకోవడం, థైరాయిడ్ స్థాయిలను నిర్వహించడం వలన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయగలరు. విజయవంతమైన గర్భధారణ అవకాశాలను పెంచగలరు.
5. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్
థైరాయిడ్, సంతానోత్పత్తి సమస్యలను నిర్వహించడంలో అనుభవం ఉన్న రీప్రొడక్టివ్ స్పెషలిస్ట్‌ను కలవండి. థైరాయిడ్ పరిస్థితులతో సంబంధం ఉన్న సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడంలో సహాయపడే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF)తో సహా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ (ART) వంటి సంతానోత్పత్తి చికిత్స ఎంపికలను సూచించవచ్చు.
6. జీవనశైలి మార్పులు
రీప్రొడక్టివ్ హెల్త్‌తో పాటు పూర్తి ఆరోగ్యానికి మద్దతిచ్చే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. సమతుల్య ఆహారం తీసుకోవడం, సాధారణ శారీరక శ్రమలో పాల్గొనడం, ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం, తగినంత నిద్ర పోవడం, ధూమపానం- మద్యపానం వంటి హానికరమైన అలవాట్లను నివారించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ జీవనశైలి కారకాలు సంతానోత్పత్తి ఫలితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్‌ని ఎదుర్కోవడానికి హెల్ప్ అవుతాయి.
7. సెల్ఫ్ కేర్, స్ట్రెస్ మేనేజ్మెంట్
సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం. అందుకే విశ్రాంతి, ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించడం మంచిది. మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్, మీరు ఇష్టపడే హాబీస్ ఫాలో అయిపోవడం, యోగా లేదా మెడిటేషన్‌లో పాల్గొనడం, అవసరమైతే కౌన్సెలింగ్ లేదా థెరపీ తీసుకోవడం బెటర్. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం థైరాయిడ్ పనితీరు, సంతానోత్పత్తి రెండింటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
Also Read...
అలాంటి మహిళలను పెళ్లి చేసుకునేందుకు పురుషుల్లో అనాసక్తి.. తమ చెయ్యి దాటిపోతారనే..!