ఇలా Sex చేస్తే జలుబు, ముక్కు దిబ్బ‌డ‌ మాయం! An Exploration of the Link Between Sex and Nasal Function

by Sumithra |   ( Updated:2022-08-30 11:48:09.0  )
ఇలా Sex చేస్తే జలుబు, ముక్కు దిబ్బ‌డ‌ మాయం! An Exploration of the Link Between Sex and Nasal Function
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కొన్నేళ్ల క్రితం సైకలాజికల్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన‌ అధ్యయనం సెక్స్‌కి, రోగ‌నిరోధ‌క శ‌క్తికి మ‌ధ్య సత్సంబంధాన్ని వివ‌రించింది. దీన్ని బ‌ట్టి, వారానికి ఒకటి లేదా రెండుసార్లు సంభోగం చేయడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్ A స్థాయిలు పెరుగుతాయని వెల్లడించింది. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించే రోగనిరోధక వ్యవస్థకు చెందిన‌ యాంటీబాడీల‌ ప్రతిస్పందనలో పాత్ర వ‌హిస్తుంద‌ని పేర్కొంది. ఇక‌, జలుబుతో పోరాడటం కంటే దాన్ని త్వ‌ర‌గా వ‌దిలించుకోడానికి సెక్స్ మంచి మార్గ‌మ‌ని అంటున్నారు నిపుణులు.

గత సంవత్సరం, జర్నల్ ఇయ‌ర్‌, నోస్ & టంగ్‌లో వైద్య నిపుణులు రాసిన వ్యాసం ప్ర‌కారం, భావప్రాప్తి కలిగి ఉండటం అనేది నాస‌ల్‌ స్ప్రే లాంటి ప్రభావాన్ని చూపుతుంద‌ని, మంచం మీద‌కు వెళ్లేటప్పుడు మీరు ఎంత చురుకుగా ఉన్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే, కొంచెం ఎక్కువ శక్తి ఉన్నవారు సెక్స్‌ను వ్యాయామంగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని తెలిపారు. సెక్స్‌లో చురుగ్గా ఉండటం అనేది డీకంజెస్టెంట్‌గా చూపబ‌డ‌గా, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల అనేది నాసికా రంధ్రంలో శ్లేష్మాన్ని వదులుగా చేస్తుంతుంద‌ని, అయితే, ఇది నాసికా ఉత్సర్గ ప్రవాహాన్ని యాక్టివేట్ చేస్తుంద‌ని తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి

తరచూ హస్తప్రయోగం మంచిదే.. శాస్త్రీయ కారణాలతో నిరూపితం

శృంగారంపై విరక్తి కలిగిందా..? అయితే మీరు ఈ కేటగిరీకి చెందినవారే!

బహిరంగంగా సెక్స్ టాయ్ ఉపయోగించిన ప్లేయర్.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed