Calcium deficiency : శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? కారణం అదే కావచ్చు!

by Javid Pasha |   ( Updated:2024-09-11 16:54:07.0  )
Calcium deficiency : శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? కారణం అదే కావచ్చు!
X

దిశ, ఫీచర్స్: పది నిమిషాలు కూర్చోగానే నడుము, మెడలు లాగేస్తున్నాయా?, తరచుగా గందరగోళానికి గురవుతున్నారా? అయితే మీ శరీరంలో కాల్షియం లోపించి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మైకం కమ్మినట్లు అనిపించడం, తల తిరగడం, ఏకాగ్రతను కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కాల్షియం తగినంతగా అందనప్పుడు కనిపిస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో చూద్దాం.

* నిజానికి దంతాలు, ఎముకలు, కండరాలు బలంగా ఉండటంలో కాల్షియం బాగా సహాయపడుతుంది. అందుకే రెగ్యులర్‌గా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. వీటిలో కాల్షియం అధికంగా ఉండటంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒకవేళ అది లోపిస్తే మతిమరుపు, తలనొప్పి, గందరగోళం, మానసిక ఆందోళన వంటివి సంభవించే అవకాశం ఉంటుంది.

* చర్మంపై దద్దుర్లు, దురద, పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం, గోర్లు పెళుసుకుగా మారడం, తామర, సోరియాసిసిస్ వంటివి కూడా శరీరంలో కాల్షియం అధికలోపం వల్ల సంభవిస్తాయి. అలాగే కండరాల నొప్పులు, తిమ్మిర్లు, వంటివి కూడా తలెత్తుతాయి. దంతక్షయం లేదా చిగుళ్లపై పగుళ్లు ఏర్పడటం కాల్షియం లోపం కారణంగా వస్తాయి. మెడ నరాలు గుంజడం, కాళ్లు, చేతులు లాగడం వంటివి అందులో భాగమే. కాబట్టి ఈ లక్షణాలు వారానికి మించి కనిపిస్తే గనుక వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి వారు సూచించే జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Also Read: Food for Hemoglobin : హిమోగ్లోబిన్ పెంచే అద్భుత ఆహారాలు.. దేనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే..

Advertisement

Next Story

Most Viewed