- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీటిలో తేలే ఇటుకలు
దిశ, ఫీచర్స్: నీటిలో తేలె ఇటుకలు కాకతీయుల కాలం కంటే ముందే ఉన్నాయని గుర్తించారు చరిత్ర పరిశోధకుడు డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. పురావస్తు చరిత్ర పరిశోధనలో భాగంగా జనగామ జిల్లా కేంద్రానికి సరిహద్దు గ్రామాలైన వడ్లకొండ, చీటకోడూరు మధ్యలోని పొట్టి గుట్ట వద్ద నీటిలో తేలే ఇటుకను గుర్తించారు. ఇక్కడ ప్రాచీన శిలాయుగం నుంచే ఆది మానవుల ఉనికి కనిపిస్తుంది. నవీన శిలాయుగం నాటి గ్రూవ్స్ ఉన్నాయి. బృహత్సులా యుగానికి చెందిన అనేక సమాధులు కూడా గుర్తించబడ్డాయి. ఒకటి రెండు శతాబ్దాలకు చెందిన శాతవాహనుల కాలం నాటి ఇటుకల నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడి పాటి మీదనే బోలుగా, తేలికగా ఉన్న నీటిలో తేలే ఇటుక లభించింది.
కాకతీయులు రామప్ప గుడి గోపురానికి ఉపయోగించినట్లు చెబుతున్న నీటిలో తేలే ఇటుకల తయారీ అంతకు ముందు నుండే ఉండవచ్చునన్నది ఇక్కడ లభించిన ఇటుక ద్వారా తెలుస్తోందన్నారు రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఇప్పటికే జనగామ జిల్లా వ్యాప్తంగా అనేక సంఖ్యలో చారిత్రక ఆధారాలు, పనిముట్లను గుర్తించిన ఆయన.. ఇంటర్నేషనల్ మ్యూజియం డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Also Read..