- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్నింగ్ సెక్స్‌తో త్వరగా పిల్లలు పుట్టే చాన్స్
దిశ, ఫీచర్స్ : మార్నింగ్ సెక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిపై పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని అంటున్నారు నిపుణులు. హార్మోన్లు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని, పునరుత్పత్తి విషయంలో సహాయపడుతుందని నిర్ధారించారు. సెక్స్ చేయడానికి ఉదయం మంచి సమయమని అంటున్న ఎక్స్‌పర్ట్స్.. ఈ విషయాన్ని ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారో తెలుసుకుందాం.
*సెక్సువల్ ఇంటర్‌కోర్స్ విషయంలో ఆల్మోస్ట్ అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ సమయాన్ని ఇష్టపడుతారు. కానీ ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం.. ఏదో ఒక నిర్దిష్ట సమయాన్ని ఎంచుకోవడం మూలంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్తుంటారు నిపుణులు. అయితే సరికొత్త అధ్యయనం మాత్రం మార్నింగ్ టైమ్ సెక్స్.. ఒత్తిడిని తగ్గిస్తుందని, రోజంతా చురుకుగా ఉండేలా, ఉత్పాదకతను పెంచేలా చేస్తుందని చెప్తోంది.
*ఉదయం సమయంలో.. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ లెవల్స్ రెండూ సరైన స్థాయిలో ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క లిబిడో లెవల్ వారి హార్మోన్ స్థాయిల ద్వారా నేరుగా ప్రభావితమవుతుంది కాబట్టి భార్యాభర్తలిద్దరూ చాలా చురుకైన అనుభూతిని కలిగి ఉంటారు. అంతేకాదు ఈ టైమ్‌లో సెక్స్ ద్వారా పిల్లలు పుట్టే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
* సెక్స్.. లవ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రేమ, బంధాన్ని నియంత్రించే మెదడులోని రసాయనం. కాగా మార్నింగ్ సెక్స్‌తో మరింత ఆక్సిటోసిన్ ఉత్పత్తి జరిగి.. భాగస్వామిపై ప్రేమ, అనురాగం పెరిగిపోతుందని.. రోజంతా సంతోషకరమైన, తేలికైన భావాలు కలిగి ఆ బంధం దృఢంగా మారుతుందని వివరించారు.