- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పచ్చి పసుపు టీ తో ఇన్ని ప్రయోజనాలా ?
దిశ, ఫీచర్స్ : పచ్చి పసుపు భారతీయుల వంటగదిలో ఒక మసాలా మాత్రమే కాదు. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పాటు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అనేక సీజనల్ వ్యాధుల నుండి మనుషులను దూరంగా ఉంచుతుంది. ఇది జీవక్రియను పెంచడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. పచ్చి పసుపును సరైన పద్ధతిలో ఆహారంలో ఉపయోగించినప్పుడే దాని ప్రయోజనం లభిస్తుంది. పచ్చి పసుపును ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి పసుపు టీ..
పచ్చి పసుపు పూర్తి ప్రయోజనాలను పొందడానికి దాంతో టీ తయారు చేసి తాగవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అందుతాయి. పచ్చి పసుపు టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. పచ్చి పసుపు టీ చేయడానికి ఒక కప్పు నీటిని మరిగించి, దానిలో పచ్చి పసుపు చూర్ణం వేయాలి. నీరు పసుపు రంగులో పూర్తిగా మారినప్పుడు దానిని ఫిల్టర్ చేసి తాగాలి.
పచ్చి పసుపు టీ తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు..
1. పచ్చి పసుపు టీ తాగడం వలన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. పచ్చి పసుపు జీర్ణవ్యవస్థలోని కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ద్వారా శరీరం మరింత పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.
2. పచ్చి పసుపు టీ తాగడం మధుమేహ రోగులకు మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇది శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది.
3. పచ్చి పసుపు టీ తాగడం వలన బరువు త్వరగా తగ్గొచంట. పచ్చిపసుపులో ఉండే బర్నింగ్ ఎంజైమ్‌లు కడుపులో ఉన్న అదనపు కొవ్వును కాల్చడానికి పని చేస్తాయి.
4. అంతే కాదు పచ్చి పసుపు ముఖంపై కనిపించే ముడతలను కూడా తొలగిస్తుందని చెబుతారు.
5. పచ్చి పసుపు టీ తాగడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయట. దీనితో పాటు ముఖం పై మచ్చల గుర్తులను కూడా తగ్గించవచ్చు.
Read More..
పాలు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మరిగిస్తున్నారా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే..?