ఆరోగ్యానికి మేలు చేసే ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్.. ఎందులో ఏయే పోషకాలు ఉంటాయంటే..

by Javid Pasha |   ( Updated:2024-05-11 15:12:46.0  )
ఆరోగ్యానికి మేలు చేసే ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్.. ఎందులో ఏయే పోషకాలు ఉంటాయంటే..
X

దిశ, ఫీచర్స్ : కేవలం వ్యాయామాలు, కొన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం చేకూరదు. హెల్తీగా ఉండేందుకు తగిన పోషకాహారం, ముఖ్యంగా ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ అవసరమని నిపుణులు చెప్తున్నారు. మనం రోజూ తీసుకునే ఆహారంలోనూ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే రొటీన్ ఫుడ్స్ దీర్ఘకాలం కొనసాగించడంవల్ల కొన్నిసార్లు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందకపోవచ్చు. ఈ లోపాన్ని భర్తీ చేయాలంటే అన్ని రకాల ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* పాలకూర : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్‌లో పాలకూర ముఖ్యమైంది. ఇందులో ఇందుల ఐరన్, విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ, సి కూడా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పి నివారణలో, ఒత్తిడిని తగ్గించడంలో మెడిసిన్ మాదిరి పనిచేస్తుంది. ఇందులో ఫోలేట్ కంటెంట్ ఉండటంవల్ల గర్భవతులకు మంచిది.

* పైనాపిల్ : ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్‌లో పైనాపిల్ కూడా ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ క్లాట్ అయ్యే పరిస్థితిని అడ్డుకుంటాయి. అప్పుడప్పుడూ పైనాపిల్ తీసుకుంటే ఉంటే రక్త నాళాల్లో ఆటంకాలు తొలగుతాయి. శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగు పడుతుంది.

* మామిడి : సీజనల్ పండ్లల్లో మామిడి ఒకటి. ఇందులోనూ నొప్పి నివారణ గుణాలు ఉంటాయి. లివర్ ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించడంలో, ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంటా ఉంటాయి. బాడీలో ఆక్సిజన్ లెవల్స్ కాపాడటంలో ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి.

* బీట్‌రూట్‌: ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ ఫుల్లుగా ఉంటుంది. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరాలో కీ రోల్ పోషిస్తుంది. బ్లడ్ సర్యులేషన్ పెంచడంతోపాటు హైపోక్సియా రిస్కును తగ్గిస్తుంది. కండరాల బలానికి దోహదపడుతుంది. ఇందులో ఐరన్ ఫోలేట్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి కాబట్టి బీట్ రూట్ అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిది.

* స్వీట్ పొటాటోస్ : చిలగడ దుంపల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ధమనుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్ట్ రిలేటెడ్ ప్రమాదాలను తగ్గిస్తాయి. విటమిన్- ఏ, సి కూడా ఉంటాయి. రక్త సరఫరాలో ఆక్సిజన్ స్థాయిల నియంత్రణలో చిలగడ దుంపల్లోని పోషకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Read More...

వేసవిలో దొరికే ఈ పండుతో బరువు సులభంగా తగ్గవచ్చు..!

Advertisement

Next Story

Most Viewed