ఓ వైపు హిల్ స్టేషన్లు.. మరో వైపు ద్వీపం.. చూసేందుకు ఎంత అందంగా ఉందో !

by Sumithra |
ఓ వైపు హిల్ స్టేషన్లు.. మరో వైపు ద్వీపం.. చూసేందుకు ఎంత అందంగా ఉందో !
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో సందర్శించడానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి ప్రదేశాలను వీక్షించేందుకు విదేశాల నుంచి కూడా పర్యాటకులు తండోపతండాలుగా వస్తుంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో అనేక ఆఫ్‌బీట్ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే వీటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఇటీవలి కాలంలో సోలో ట్రావెలింగ్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కొంతమందికి బీచ్‌కి వెళ్లడం ఇష్టం. చాలా మంది వ్యక్తులకు పర్వతాలు లేదా హిల్ స్టేషన్‌లకు వెళ్లడం ఇష్టం. మరికొంతమంది వన్యప్రాణుల పట్ల ఆసక్తితో ప్రకృతిని ఆరాధించడానికి వెళతారు. అయితే ఈ ఈ ప్రదేశాలన్నీ ఒకే చోట కలగలుపుకుని ఉంటే ఎలా ఉంటుంది. ఆలోచిస్తుంటే మది పులకరించిపోతుంది కదా. మరి అలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని అస్సాంలో సందర్శించవచ్చు. మరి ఆ ప్రాంతాల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హఫ్లాంగ్

అస్సాంలోని ఏకైక హిల్ స్టేషన్ హఫ్లాంగ్. దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. హఫ్లాంగ్‌లో ఉన్న పచ్చని పర్వతాలు ఈ ప్రదేశ అందాన్ని పెంచుతాయి. ఇక్కడ దట్టమైన అడవవి, స్వచ్చమైన నీరు, ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి మైమరచిపోవచ్చు. ఇక్కడ మీరు హైకింగ్ ని కూడా ఆనందించవచ్చు.

బరాక్ లోయ

మీరు అస్సాం సందర్శించడానికి వెళ్లినట్లయితే, ఖచ్చితంగా ఇక్కడ టీ తాగండి. అస్సాం టీ తోటలకు చాలా ప్రసిద్ధి చెందింది. పచ్చని తేయాకు తోట అందాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అస్సాంలోని బరాక్ లోయలో టీ తోటలే కాకుండా అందమైన దృశ్యాలను కూడా చూడవచ్చు. డోలు సరస్సు అనే పేరుతో ఒక సరస్సు కూడా ఉంది.

ఉమానంద్ ద్వీపం..

ఉమానంద ద్వీపం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉంది. గౌహతి నుండి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఉమానంద్ ద్వీపం ప్రపంచంలోని అతిచిన్న జనావాస ద్వీపం. 17వ శతాబ్దంలో నిర్మించిన శివాలయం కూడా ఇక్కడ ఉంది.

మనస్ నేషనల్ పార్క్..

మనస్ నేషనల్ పార్క్ అస్సాంలో చాలా ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో కూడా చేర్చారు. వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఉన్నవారు ఇక్కడ తప్పక సందర్శించాలి. ఇక్కడ చాలా వన్యప్రాణులు కనిపిస్తాయి.

Advertisement

Next Story