ఎండలకు పేలి పోతున్న ACలు.. తప్పుకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

by Sujitha Rachapalli |
ఎండలకు పేలి పోతున్న ACలు.. తప్పుకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..
X

దిశ, ఫీచర్స్: ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే నాగపూర్ లో 56 డిగ్రీలు నమోదు కాగా ఢిల్లీలో 52 దాటేసింది. వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉక్కపోతకు ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో చాలా మంది ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఏసీ కిందే ఉంటున్నారు. దీంతో బర్డెన్ అధికం కావడం, వేడి గాలులు వీయడంతో పేలిపోతున్నాయి. ఢిల్లీ, ముంబైలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా.. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆర్థిక, ప్రాణ నష్టం నెలకొంది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పలు సూచనలు అందిస్తున్నారు నిపుణులు.

* చిన్న సాకెట్స్ వాడటం AC పేలిపోయేందుకు కారణం కావచ్చు. కాబట్టి ISI మార్క్ ఉన్న వైరింగ్ వినియోగించాలి. సర్క్యూట్ బ్రేకర్స్ ద్వారా కరెంట్ లీక్ అవుతుందో లేదో తరచూ చెక్ చేయాలి.

* రెగ్యులర్ ఏసీ సర్వీస్, సర్జ్ ప్రొటెక్టర్స్ వాడటం ద్వారా ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ నివారించవచ్చు.

* ఏసీ ఫిల్టర్లు సరిగ్గా క్లీన్ చేయాలి. అవుట్ డోర్ యూనిట్స్ కు ప్రాపర్ వెంటిలేషన్ ఉండేలా చూడాలి.

* ఎక్స్ టెన్షన్ బాక్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఏసీ ఎలక్ట్రికల్ లోడ్స్ తో వైరింగ్ మెల్ట్ అయి మంటలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed