ఆ పని చేసే ముందు అరటి పండు తినండి...

by Sujitha |
ఆ పని చేసే ముందు అరటి పండు తినండి...
X

దిశ, ఫీచర్స్ : రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం అనారోగ్యానికి దూరంగా ఉంచుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. అయితే మార్నింగ్ ఎక్సర్ సైజ్ చేసే ముందు ఏమైనా తినొచ్చా లేదా? ఒకవేళ తింటే ఏం తీసుకోవాలి ? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతాయి. వీటికి సమాధనమిస్తున్న నిపుణులు.. అరటి పండు బెస్ట్ ఆప్షన్ అని సూచిస్తున్నారు. ఎందుకో వివరణ కూడా ఇచ్చారు.

1. సమృద్ధమైన కార్బోహైడ్రేట్స్

ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ జర్నల్‌లో ప్రచురించబడిన 2018 అధ్యయనం ప్రకారం, అరటిపండ్లు కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. మీ శరీరానికి శక్తిని అందించేందుకు గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమవుతుంది. వ్యాయామం చేసే సమయంలో నిరంతరం శక్తిని అందిస్తుంది.

2. పొటాషియం అధికం

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కండరాల పనితీరు, నరాల ప్రేరణలలో కీలక పాత్ర పోషిస్తుంది. అడ్వాన్సెస్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన 2012 అధ్యయనం ప్రకారం... వ్యాయామం చేసే సమయంలో చెమట ద్వారా పోగొట్టుకున్న పొటాషియంను తిరిగి పొందడం వల్ల కండరాల తిమ్మిర్లు, అలసటను నివారించవచ్చు.

3. సులభంగా జీర్ణం

ఇతర ప్రీ-వర్కౌట్ స్నాక్స్ కంటే అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు కడుపులో ఎలాంటి అసౌకర్యం కలగకుండా హెల్ప్ చేస్తుంది.

4. కండరాల పునరుద్ధరణ

ప్లోస్ వన్ జర్నల్‌లో ప్రచురించబడిన 2018 అధ్యయనం ప్రకారం అరటిపండ్లు వ్యాయామం తర్వాత కండరాలను పునరుద్ధరించడంలో సహాయపడుతాయి. కార్బోహైడ్రేట్లు, పొటాషియం కలయిక వల్ల ఇది సాధ్యమవుతుంది. విటమిన్ B6 (పిరిడాక్సిన్) కలిగిన అరటి పండు.. వ్యాయామం తర్వాత లీన్ కండరాలను పునర్నిర్మించడానికి అవసరమని చెప్తున్నారు నిపుణులు.


5. నిర్జలీకరణ నివారణ

అరటిపండులో ఉండే ఫైబర్ మీ వ్యాయామం సమయంలో నెమ్మదిగా, స్థిరమైన శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. అదనంగా ఎలక్ట్రోలైట్‌లతో నిండిపోయిన పండు..

శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రిస్తుంది. చెమట ద్వారా బయటకు వెళ్ళే ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి నింపడం ద్వారా బాడీ డీహైడ్రెట్

కాకుండా ఉంటుంది. పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలసట వ్యవధిని 10-15 శాతం తగ్గిస్తుంది.

6. వాపు తగ్గుదల

మీరు వాపు తగ్గించడానికి మార్గాల కోసం వెతుకుతున్నారా? అయితే ఆహారంలో అరటిపండ్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫినాల్స్, కెరోటినాయిడ్లు, ఫైటోస్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉండటం వల్ల వ్యాయామం తర్వాత కండరాల వాపును తగ్గిస్తుంది.

దుష్ప్రభావాలు

* అరటిపండ్లను అతిగా తినడం వల్ల ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిర్లు, వెర్టిగో, వికారం, వాంతులు ఉండవచ్చు.

* ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగవచ్చు.

* పండని అరటిపండ్లను తినడం వల్ల వాటిలో అధికంగా ఉండే పిండి పదార్థం మలబద్ధకానికి దారితీస్తుంది.

* బనానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని తినడం వల్ల హైపర్‌కలేమియా వస్తుంది. గుండె సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ కండరాల బలహీనత ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

* మైగ్రేన్‌లు ఉన్నవారు అరటిపండులో టైరమైన్ ఉన్నందున వాటిని అతిగా తినడం వల్ల ఎక్కువ కావచ్చ

Next Story

Most Viewed