2024లో మొదటి సూర్య గ్రహణం కారణంగా.. ఈ రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్.. మీ రాశి ఉందా?

by Prasanna |
2024లో మొదటి సూర్య గ్రహణం కారణంగా.. ఈ రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్: 2024లో మొదటి సూర్యగ్రహణం త్వరలో ఏర్పడనుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు, చంద్ర గ్రహాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఈ ఏప్రిల్ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, ఈ సారి సూర్యగ్రహణం మన దేశంలో తప్ప అన్ని దేశాల్లోఒకేసారి కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సూర్యగ్రహణం యొక్క సంభవం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా, ఈ సమయంలో ఈ రాశుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఈ సూర్య గ్రహణం ఏ ఏ రాశుల వారిపై ప్రభావం చూపనుందో ఇక్కడ తెలుసుకుందాం..

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారు సూర్యగ్రహణం కారణంగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అదనంగా, ఈ కాలంలో వివిధ సమస్యలు తలెత్తవచ్చు. అందుకోసం వీరు వివిధ రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశ్రామికవేత్తలు అయితే, అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టకపోవడమే మంచిది.

తులా రాశి

ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కారణంగా ఈ రాశి వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మీరు పని చేసే ఆఫీసులో విభేదాలు రావొచ్చు. మీరు ఎన్నడూ ఊహించలేని మార్పులను మీ జీవితంలో ఎదుర్కొంటారని అంటున్నారు. దీంతోపాటు వ్యాపారులు కూడా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed