- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాచిలర్ బ్రదర్స్ ఈ ఎగ్ కర్రీ మీకోసమే.. కేవలం 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు
దిశ, ఫీచర్స్: కొంతమందికి ఎగ్ లేనిదే ముద్ద దిగదు. దీనితో ఒకటి కాదు రక రకాల వంటకాలను తయారు చేస్తుంటాము. మరి కొంత మంది గుడ్లను, కూరగాయలతో కలిపి వండుకుంటారు. కూరల్లో కలిపి వండుకోవడం వలన నోటికి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీరు గుడ్లతో ఏ కూర చేసినా రుచికరంగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే, వారం రోజులలో సగం గుడ్లతో వంటలు చేస్తుంటారు. బ్యాచిలర్స్ కోసం ఎగ్ కర్రీ గురించి ఇక్కడ చెప్పబోతున్నాము. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎగ్ కర్రీ కి కావాల్సిన పదార్థాలు:
ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- 1/2 టీ స్పూన్
ఎండుమిర్చిలు - 4
అల్లం వెల్లుల్లి - 1/2 టీ స్పూన్
టమాటాలు - 2
ఉప్పు - రుచికి సరిపడా
ఉడికించిన గుడ్లు - 5
కారం - తగినంత
ధనియాల పొడి - 1 టీ స్పూన్
పుదీనా ఆకులు
గరం మసాలా - 1 టీ స్పూన్
కొత్తిమీర ఆకులు - రుచికి సరిపడా
తయారీ విధానం:
గుడ్డు కూర చేయడానికి, మీరు ముందుగా స్టవ్ మీద పాన్ ఉంచాలి. ఆ తర్వాత, రెండు టీస్పూన్ల మంచి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. తరిగిన ఉల్లిపాయ వేసి, పాన్ మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలపాలి. తర్వాత టొమాటో ముక్కలను వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక గ్లాసు నీరు వేసి మరో రెండు నిమిషాలు వేడి మీద ఉంచండి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఉడికించిన గుడ్లను వేడినీళ్లలో వేసి నాలుగు నిమిషాలు బాగా ఉడికించాలి. ఆ తర్వాత, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు జోడించండి. మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత, తరిగిన పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా ఉప్పు వేసి, నూనెపై తేలే వరకు మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఇలా తయారయ్యాక రెండు నిమిషాలు పక్కన పెట్టి ఎగ్ కర్రీని అన్నంలో వేసుకుని తినవచ్చు.