- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అండర్‌వేర్‌తో ఓటు వేశారు.. రాజ్యాంగంలో రాసి లేదు కదా అని..
దిశ, ఫీచర్స్: ఒంటినిండా బట్టలు ధరించే 'ఓటు హక్కు' వినియోగించుకోవాలని రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నిస్తున్న కొందరు ఆస్ట్రేలియన్స్.. విచిత్రంగా అండర్‌వేర్‌లో పోలింగ్ బూత్స్‌కు చేరుకుని ఓటు వేశారు. అయితే ఇదంతా అండర్‌వేర్ కంపెనీ బడ్జీ స్మగ్లర్స్ మార్కెటింగ్ ట్రిక్ కాగా.. పూర్తిగా వర్కౌట్ అయింది.
సాధారణంగా ఆస్ట్రేలియాలో బడ్జీ స్మగ్లర్స్ క్లోత్స్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఈ క్రమంలో మరింత సేల్ పెంచడానికి, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ఈ కంపెనీ అండర్‌వేర్స్ ధరించి ఓటు వేసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటే.. ఫ్రీ ప్యాంటీస్ అందిస్తామని వినియోగదారులకు కాల్ చేసింది. దీనికి రెస్పాండ్ అయిన చాలా మంది యువకులు.. ఈ ఓటింగ్‌ను ఫన్నీ ఈవెంట్‌గా మార్చేశారు. ఇది కాస్తా #SmugglersDecideతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్యాంటీస్ ధరించి ఓటేసిన ఫొటోస్ చూసి జనాలు హ్యాపీగా నవ్వుకుంటుంటే.. కంపెనీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు వ్యవస్థాపకులు ఆడమ్ లిన్‌ఫోర్త్. ఒకరు లేదా ఇద్దరు చేస్తారనుకున్నాం కానీ వేల మంది యువకులు స్పందిస్తారనుకోలేదని తెలిపాడు. నిజంగా బడ్జీ స్మగ్లర్‌కు ఇది ఖరీదైన రోజని సంతోషపడిపోయాడు.