ఆగస్టు 23rd: Indira Gandhi జీవితంలో కీలకమైన రోజు

by Hamsa |   ( Updated:2022-08-23 06:25:35.0  )
ఆగస్టు 23rd: Indira Gandhi జీవితంలో కీలకమైన రోజు
X

దిశ, ఫీచర్స్: దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1978, ఆగస్టు 23న జీప్ కుంభకోణం కేసులో కోర్టు మెట్లెక్కారు. 1977 ఎన్నికల కోసం ఉచిత వాహనాల వినియోగాన్ని పొందేందుకు ఇందిరతో పాటు ఐదుగురు అధికారులు వ్యాపారవేత్తలను దారుణంగా మోసగించారని ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై విచారించిన న్యాయమూర్తి $1,875 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసి, దేశం విడిచి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆమెను తీహార్ జైలులో బంధించాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్న అప్పటి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం.. ఈ 'జీప్ స్కామ్'లో మరోసారి డిసెంబర్ మూడో వారంలో ఇందిరను అరెస్ట్ చేసింది.

ఇందుకోసం పార్లమెంట్ నుంచి ప్రత్యేక హక్కులు పొందింది. తనతో పాటు సంజయ్ గాంధీ కూడా జైలు పాలు కాగా.. వారం రోజుల తర్వాత విడుదలైన ఇందిరా గాంధీ మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. ఈ జైలు శిక్ష ద్వారా సానుభూతి సొంతం చేసుకుని ఓటర్లను తనవైపు తిప్పుకున్నారు.

ఆ వీడియో అప్లోడ్ చేసి తీరుతా.. మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

Advertisement

Next Story

Most Viewed