పళ్ళు జివ్వుమంటున్నాయా.. అయితే ఈ టిప్ ట్రై చేయండి!

by Prasanna |   ( Updated:2023-08-18 09:29:06.0  )
పళ్ళు జివ్వుమంటున్నాయా.. అయితే ఈ టిప్ ట్రై చేయండి!
X

దిశ,వెబ్ డెస్క్: పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు సెన్సిటివిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సెన్సిటివిటీ కారణంగా చల్లని పదార్థాలు,తీయని పదార్థాలు, వేడి పదార్థాలు తిన్నా కూడా పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి.కొన్ని సార్లు ఈ నొప్పితో ఏమి తినలేరు. వీటి వల్ల దవడలు, పండ్లు ఊడిపోవడం లాంటి సమస్యలు కూడా సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్య ఉన్న వారు ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉంటుంటారు. పళ్ల సెన్సిటివిటీ ఉన్న వారు హాయిగా ఏమి కూడా తినలేరు, తాగలేరు. కొందరికి తీపి పదార్థాలు ఇష్టమైన సరే ఈ నొప్పి కారణంగా వాటికి దూరంగా ఉంటారు.అయితే ఈ సమస్యను మీ వంటింటి చిట్కాలనుపయోగించి ఉపశమనం పొందవచ్చు.

ఉప్పు నీళ్లు బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఇది దంత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఉప్పులో ఉండే క్రిమినాశక గుణాలు మంటను తగ్గించేందుకు తోడ్పడతాయి. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు రెండుసార్లు ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఇది మీ నోటి ఆరోగ్యానికి అద్భుతమైన మౌత్ వాష్‌గా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గ్లాస్‌ వేడి నీటిలో 1/2 టీస్పూన్‌ ఉప్పు వేసి వీటిని నోటిలో వేసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల ఆ సెన్సిటివిటీ సమస్య నుంచి పొందవచ్చు.

Advertisement

Next Story

Most Viewed