- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలం Water heater వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
దిశ, ఫీచర్స్: చలికాలం, వర్షాకాలం చాలా మంది చన్నీటి స్నానాలకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో వానలో తడిసిన తర్వాత వేడి వేడి నీటితో స్నానం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసేస్తున్నారు. కొందరు గీజర్ వాడితే.. మరికొందరు గ్యాస్ స్టవ్ మీద వేడి చేస్తున్నారు. కానీ పేద, దనిక అని తేడా లేకుండా చాలా మంది వాటర్ హీటర్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇది తక్కువ ధరకే లభించడంతో పాటు, అతి తక్కువ సమయంలోనే నీరు కూడా వేడిగా మారిపోతుండటంతో అంతా వాటర్ హీటర్‌నే వాడటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇక చిన్న పెద్ద ఈ నీటిని ఉపయోగించి స్నానాలు చేస్తున్నారు. కానీ వాటర్ హీటర్ వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అలాగే హీటర్ వాడేటప్పుడు వాడేటప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువు విడుదలవుతుంది. దీంతో తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యుత్‌తో నీరు వేడి అవుతాయి కాబట్టి దీనిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మంది చిన్నారులు దీని వల్ల ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. వాటర్ హీటర్ ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.
*హీటర్‌ను వాడే సమయంలో దాని పరిసరాల్లో చిన్నారులు వెళ్లకుండా చూసుకోవాలి. లేదా ఎవరూ తిరగని చోట మూలకు ప్రత్యేక గది ఉంటే అందులో నీరుని వేడి చేసుకోవాలి. లేదంటే దానిని చిన్నారులు ముట్టుకోవడం వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
* అయితే కొందరు హీటర్‌ను ప్లాస్టిక్ బకెట్‌కే తగిలిస్తుంటారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి అది కరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా కాకుండా చెక్క లాంటిది పెట్టడం మంచిది. అలాగే ఇనుప బకెట్స్‌కు దూరంగా ఉండాలి. దానికి హీటర్ తగిలించడం వల్ల కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంది.
* కొందరు నీరును పెట్టాక సరిపోలేదని నిర్లక్ష్యంతో అలాగే పోసేస్తారు. కానీ అలా చేస్తే చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు.
* అయితే కొంతమంది డైరెక్ట్‌గా బాత్‌రూమ్‌లోనే పెట్టేస్తుంటారు. కానీ ఒకవేళ 2 ఇన్ 1 కనెక్షన్ ఉంటే అలా చేయకూడదు. ఎందుకంటే.. స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయే అలాగే బాత్‌రూమ్‌లోకి వెళితే తడి వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
* వాటర్ హీటర్‌ను ఉపయోగించేటప్పుడు స్విచ్ ఆన్, ఆఫ్ చేసేటప్పుడు తడి చేతులతో, బట్టలతో చేయకూడదు.
గమనిక: పైన వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము.
- Tags
- Water heater