నిద్ర లేచాక కూడా బెడ్‌పై నుంచి లేవలేకపోతున్నారా..? కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

by sudharani |
నిద్ర లేచాక కూడా బెడ్‌పై నుంచి లేవలేకపోతున్నారా..? కారణాలు తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సరైన తిండి తినక.. సరిగ్గా నిద్ర పోక ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అంతే కాదు.. పడుకుందాం అన్నా కొంతమందికి నిద్ర పట్టని పరిస్థితి. ఏదో రకంగా పడుకుంటే.. నిద్ర లేచిన తర్వాత బెడ్‌పై నుంచి లెగడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే.. అది సోమరితనం అని.. లేక బద్దకమని అనుకుంటే అది మీ పొరపాటే. నిజానికి మెలుకువ వచ్చిన తర్వాత కూడా మంచంపై నుంచి లెగలేకపోతున్నారు అంటే.. దాని వెనుక అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం:

మనం తినే ఫుడ్.. మన హెల్త్‌పై, శక్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే హెల్త్‌కు ఎంత మంచిదో.. అలాగే జంక్ ఫుడ్స్ తీసుకుంటే అంత ప్రమాదం. ఈ మేరకు ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు అవి అలసట, బద్ధకాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మా బాడీ అలసటకు గురై నిద్ర నుంచి లేచిన బద్ధకంగా ఉండేలా చేస్తుంది.

సరైన నిద్ర:

మనిషికి ఆహారంతో పాటు.. సరైన నిద్ర కూడా ఎంతో అవసరం. కానీ ఇప్పుడు జనరేషన్‌లో ఎక్కువ మంది ఈ నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. టైమ్‌కి పడుకోకపోవడం వల్ల శరీరంలో అలసట, నీరసానికి ప్రధాన కారణంగా మారతాయి. కాబట్టి.. రాత్రిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు.

డీహైడ్రేషన్:

శరీరానికి నీటి శాతం ఎంతో అవసరం. తగిన వాటర్ తీసుకోకుండా ఉండటం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు, రక్తం మందంగా మారుతుంది. దీంతో బాడీలో డీహైడ్రేషన్ ఏర్పడి కణాలకు పోషకాలను అందించడం కష్టమవుతుంది. ఇది కండరాల తిమ్మిరి, అలసటను కలిగిస్తుంది. అందువల్ల రోజంతా బద్ధకంగా ఉండటంతో పాటు.. నీరసంగా అనిపించి అలాగే బెడ్‌పై పడుకుని ఉండిపోతారు.

ఉపసమనం:

పొద్దుటే నీరసంగా, బద్ధకంగా ఉండకుండా యాక్టివ్‌గా ఉండాలి అనుకుంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పుదు. వీటిలో ముఖ్యమైనది వ్యాయామం. వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇది శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరుతుంది. అలాగే.. రోజు పొద్దుటే లేచి కాస్త వ్యాయామం చేయడం వల్ల.. రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటుంది. వ్యాయామం చెయ్యడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్‌ను విడుదల అవుతుంది. ఇది మనకు సంతోషంగా ఉండేలా చేయడంతోపాటు శక్తినిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed