టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా..? ఈ సమస్యలు తప్పవు!

by Kanadam.Hamsa lekha |
టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా..? ఈ సమస్యలు తప్పవు!
X

దిశ, ఫీచర్స్: కొందమంది టాయిలెట్ వెళితే గంటల తరబడి బయటకు రాకుండా ఉంటారు. మరికొందరు టాయిలెట్ సీటుపైనే పేపర్, ఫోన్ చూస్తూ ఎక్కువ సమయం అలానే కూర్చుంటారు. అలా టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల హెమోరాయిడ్స్, కటి కండరాలు బలహీనపడతాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌లోని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలు:

పేగు సమస్యలు: టాయిలెట్‌పై 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కూర్చోకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మలం ద్వారా, పురుషనాళం చుట్టూ ఉన్న రక్త నాళాలు బ్లాక్ అవుతాయి.

పేగు క్యాన్సర్: కొన్ని సందర్భాల్లో చాలామంది ఎక్కువసేపు టాయిలెట్‌లోనే ఉంటారు. అలా ఉండటం వల్ల మలం విసర్జించడంలో నిరంతర సమస్యలు కారణమై, పేగు సిండ్రోమ్ వంటి జీర్ణాశయ సమస్యలు వచ్చే చాన్స్ ఉంటుంది. మలబద్ధకం పెరగడం, ఎక్కువసేపు టాయిలెట్ కూర్చోవడం వంటివి క్యాన్సర్‌కు సంకేతాలు.

జీర్ణసమస్యలు: టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొట్ట సరిగా శుభ్రంకాక జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

పైల్స్: టాయిలెట్ సీటుపై గంటల తరబడి కూర్చోవడం వల్ల హెమరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కూర్చొని ఎక్కువ సమయం మొబైల్ చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో మలాన్ని బయటకు పంపడానికి కండరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు మలం బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతుంది. అలా జరుగున్నట్లై ఇది పైల్స్‌కు సంకేతం.

కండరాల బలహీనత: టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం వంటివి జరుగుతుంది. దీని వలన తుంటి, కాలు కండరాలు బలహీనపడే ప్రమాదం ఉంది.

యూటీఐ: దీనిపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మూత్రనాళంలోని బ్యాక్టీరియా పేరుకుపోయి అక్కడ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడవచ్చు.

చర్మ సమస్యలు: టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది తొడలపై దద్దుర్లు, దురద వంటివి ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed