- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పచ్చసొన తినడకుండా వదిలేస్తున్నారా? ఈ పోషకాలు కోల్పోయినట్లే..?
దిశ, ఫీచర్స్: నాన్ వెజిటేరియన్లతో పాటు వెజిటేరియన్స్ కూడా గుడ్డును ఇష్టంగా తింటూ ఉంటారు. తెల్లగా నిగనిగలాడుతూ ఉండే ఎగ్‌ను గరం గరంగా ఉన్నప్పుడు తింటే ఆ టేస్ట్ వేరు. గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎగ్‌ను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. గుడ్డులో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అన్నీ లభిస్తాయి. దీంతో డైట్ ఫాలో అయ్యేవారి శక్తి కోసం గుడ్డును రోజూ తింటూ ఉంటారు. అయితే కొంతమందికి గుడ్డులోని పచ్చసొన తినేందుకు ఇష్టపడరు. పచ్చసొన తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ పచ్చసొన తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
గుడ్డులోని పచ్చసొనను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో జింక్, ఫాస్సరస్, విటమిన్లు, ఖనిజాలు లాంటి 10 పోషకాలు ఉంటాయని అంటున్నారు. విటమిన్ ఏ పచ్చసొనలో ఎక్కువగా దొరుకుతుంది. ఇవి కంటిలోని రెటీనాను కాపాడి రేచీకటి రాకుండా కాపాడుతుంది. వయస్సు పెరిగేకొద్ది చాలామందికి కంటిచూపు మందగిస్తుంది. పచ్చసొన తినడం వల్ల ఆంధత్వం రాకుండా కాపాడుతుంది. ఇక పచ్చసొనలో విటమిన్ డి కూడా లభిస్తుంది. ఆస్టియోపొరాసిన్ రాకుండా ఇది సహాయపడుతుంది.
అలాగే పచ్చసొనలో విటమిన్-ఈ కూడా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు, మెటిమలు, చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. పచ్చసొనలో విటమిన్-కె కూడా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇక పచ్చసొన తినడం వల్ల శరీరానికి కాల్షియం కూడా లభిస్తుంది. ఇది ఎముకలను స్ట్రాంగ్‌కు చేస్తుంది. వీటితో పాటు పచ్చసొనలో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కండరాలను బలోపేతం చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. అలాగే జుట్టు, గోళ్లను బలంగా ఉంచే పోషకాలు కూడా పచ్చసొనను తినడం వల్ల లభిస్తాయి.