- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసికంగా కృంగిపోతున్నారా.. అయితే ఇలా చేయండి..
దిశ, వెబ్ డెస్క్: మన శరీరం ఎంత ఆరోగ్యంగా, బలంగా ఉన్నా కూడా మానసిక ఆరోగ్యం అనేది చాలా అవసరం. ప్రస్తుత కాలంలో ధనవంతుల నుంచి బీదవారి వరకు అందరూ ఏదో ఓ రకంగా మానసిక వేదనకు గురవుతూనే ఉంటారు. దీనికి ప్రధాన కారణం జీవిన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది. ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృడంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో ఇంకా అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా అంతేస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పని అయినా సునాయాసంగా అయిపోతుంది.
పోషకాహార లోపాలు, మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫిన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. మనసు దృడంగా ఉండేందుకు మెరుగైన జీవన శైలిని పాటించాలి. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం, యోగా వంటివి చేయాలి. ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి. ఇంకా అలాగే అవసరమైన మేరకు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి.