- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? .. మీరు చేసే పొరపాట్లు ఇవే..
దిశ, ఫీచర్స్ : ఇటీవల అధిక బరువు సమస్యల చాలామందిని వేధిస్తోంది. అరుదుగా కొందరు బరువు పెరగకపోవడంవల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే రోజు వ్యాయామం చేస్తున్నా, ఆహారం సమయానికి తింటున్నా బరువు తగ్గకపోవడం వంటి ప్రాబ్లమ్స్ కొందరు ఫేస్ చేస్తుంటారు. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం.
ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం
కండరాల ఆరోగ్యానికి, జీవక్రియ మెరుగుదలకు, సంతృప్తికి ఆహారంలో భాగంగా తీసుకునే ప్రోటీన్ చాలా కీలకం. అలాగే అధిక బరువు తగ్గకపోవడానికి కూడా ప్రోటీన్ లోపం మరొక కారణమని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఇది తగినంత తీసుకోగలిగినప్పుడే మీరు రోజుకు 80-100 కేలరీలు బర్న్ చేయగలుగుతారు. దానివల్ల బరువు తగ్గే చాన్స్ ఉంటుంది. అందుకే మీ ఆహారంలో కాయధాన్యాలు, చిక్‌పీస్, క్వినోవా, టోఫు, అన్ని రకాల కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారలు తప్పక ఉండేలా చూసుకోవాలి.
తక్కువ కేలరీలు తినడం
దీర్ఘకాలికంగా తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలు తినడం జీవక్రియను 23% వరకు తగ్గిస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి కేలరీల లోటును నిర్ధారించుకోవడం ముఖ్యం. మీ అవసరాలను గుర్తించడానికి అవసరమైన కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి. సరైన కేలరీలను ఆహారంలో భాగంగా తీసుకోండి.
హార్మోన్ల అసమతుల్యత
ప్రతి 8 మంది స్త్రీలలో ఒకరు తమ జీవితంలో థైరాయిడ్ డిజార్డర్ బారిన పడుతుంటారు. ఇది తరచుగా బరువు పెరగడానికి లేదా బరువు తగ్గడంలో సమస్యలకు కారణం అవుతుంది. మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ను పట్టించుకోకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి చెక్-అప్ ద్వారా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల అధిక బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
నిద్ర లేమి
ప్రతి రోజు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు 7 నుంచి 9 గంటలు నిద్రపోయే వారి కంటే 27% ఎక్కువ బరువు పెరుగుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. మీరు బరువు తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాత్రికి 7-9 గంటల క్వాలిటీ స్లీప్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.
స్ట్రెస్ మేనేజ్ మెంట్
మానసిక ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసాల్ హార్మోన్ అధిక బరువు పెరగడాన్ని ప్రేరేపిస్తుంది. ఇది అధిక స్థాయిలో రిలీజ్ అయితే బెల్లీ ఫ్యాట్ కూడా పెరిగే చాన్స్ ఉంటుందట. అందుకే మీ డైలీ రొటీన్‌లో భాగంగా యోగా, మెడిటేషన్ లేదా డీప్‌బ్రీతింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించడం బెటర్. అలాగే బరువు తగ్గడం అనేది మీ శరీరానికి సరైన సమతుల్యతను కనుగొనే పర్సనల్ జర్నీ అని గుర్తుంచుకోండి.
Read More..
బ్రేక్‌ఫాస్ట్ టైంలో బ్రెడ్ తింటున్నారా.. పెద్దపేగు క్యాన్సర్ తప్పదంటున్న నిపుణులు!