- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం.. 10 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి తప్పదంటున్న వైద్యులు!
దిశ, ఫీచర్స్: ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే ఆటబొమ్మలు ఇచ్చేవారు. దీంతో పిల్లలు ఏం మారం చేయకుండా సైలెంట్ గా ఆడుకునేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో పిల్లల చేతికి ఫోన్ ఇస్తేనే ఫుడ్ తింటున్నారు. కుదురుగా ఆడుకుంటున్నారు. కానీ ‘‘చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల పిల్లల పెరుగుదలతో పాటు మెదడు పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది’’ అని తాజాగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పిల్లలు వివిధ ప్రయోజనాల కోసం టచ్ మొబైల్స్ ను వాడుతున్నారు. మరికొంతమంది ఫోన్లల్లో గేమ్స్ ఆడటం, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా 10 ఏళ్ల పిల్లలు స్మార్ట్ మొబైల్స్ కు ఎక్కువగా బానిసైతే మాత్రం వారి కళ్లకు హానికరమని, ఫోన్లలో ఎక్కువ సేపు మునిగితేలడం వల్ల పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ‘‘అతిసారం, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాగా పీడియాట్రిక్ పల్మొనాలజీ మెదంతా ది మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ ఉత్తమ్ వెల్లడించారు.
అలాగే స్మార్ట్ మొబైల్ కళ్లపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ఎక్కువ సేపు ఫోన్ వాడటం వల్ల కంటి చూపు మందగిస్తుందని, కళ్లు పొడిబారిపోతాయని అన్నారు. ఇంకా ఏడాదిన్నర వయస్సు పిల్లలకు తమ తల్లిదండ్రులే స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని , అలా చేస్తే మీ పిల్లల ఆరోగ్యం మీరే పాడు చేసినవారవుతారని డాక్టర్ రాజీవ్ ఉత్తమ్ పేర్కొన్నారు.