- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు చెప్పేది వినకుండా అరిచేస్తున్నారా.. ప్రతి ఒక టీచర్ ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
దిశ, ఫీచర్స్ : మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. అలాగే ఈ తరం పిల్లల మైండ్‌సెట్ కి తగ్గటుగా తల్లితండ్రులు.. అలాగే వారికి విద్య బోధించే ఉపాధ్యాయులు కూడా వారి నడవడికను బట్టి నడుచుకోవాలి. మన ఆలోచనలకు వారి ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది.ఎందుకంటే వారు రాబోయే కాలం కోసం అభివృద్ధి చెందుతున్నా పిల్లలు. కనుక వారి ఆలోచనా విధానానికి అనుగుణంగా మనం మరుతూ వారిని మంచి దారిలో ఉంచాలి. కానీ కొంతమంది అలా కాకుండా వారు ఏం చెబుతున్నారు.. ఏం చెప్పలనుకుంటున్నారో కూడా వినకుండా ఆవేశపడుతూ.. త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి తిట్టేస్తారు. అలా చేయడం వల్ల మీరు పశ్చాత్తాప పడే పరిస్థితి రావచ్చు.
ముఖ్యంగా చాలా మంది తల్లులు స్కుల్‌కి వచ్చినప్పుడల్లా టీచర్స్‌తో తమ పిల్లల అలవాట్లు ఇష్టాలు చెబుతుంటారు. మా పిల్లడికి అది అంటే ఇష్టం .. ఇలా చేస్తే భయపడతాడు మేడం కొంచెం చూసుకోండి అంటూ వారి ఇష్టాలు, భయాలు చెబుతుంటారు. అలాంటివి టీచర్స్ గుర్తుంచుకోవాలి. అయితే ఒక స్కూల్‌లో ఆరు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఒక టీచర్ గణితాన్ని బోధిస్తోంది. అందులో ఒక పిల్లవాడిని పిలిచి ‘నేను నీకు రెండు ఆపిల్ పండ్లు, రెండు మామిడి పండ్లు ఇచ్చాననుకో... నీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి’ అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు ‘ఐదు పండ్లు’ అని చెప్పాడు. ఆ పిల్లవాడి సమాధానం విని టీచర్‌కు ఆశ్చర్యం వేసింది. అదెంటి బాగా చదివే పిల్లవాడు ఇలా ఎందుకు చెప్పాడో అనుకుంది.
అప్పుడు ఆ టీచర్‌కి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి.. కోపడకుంగా ఎంతో ఓపికతో ‘ సరే నేను నీకు రెండు వైట్ చాక్లెట్స్, రెండు బ్రౌన్ చాక్లెట్స్ ఇస్తే... మీ దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉంటాయి’ అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు నాలుగు చాక్లెట్లు అని సరైన సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ టీచర్ చాలా సంతోషించింది. అంటే ఆ పిల్లాడి ఇష్టని దృష్టిలో పెట్టుకుని అదే ప్రశ్నను మార్చి అడిగింది. దీని బట్టి ప్రతి ఒక టీచర్ కూడా పిల్ల విషయంలో ప్రేమగా.. తెలివిగా నడుచుకోవాలి.
కానీ కొంతమంది ఉపాధ్యాయుల్లో ఓపిక ఉండదు. పిల్లలను కొట్టడం తిట్టడం చేస్తుంటారు. పిల్లలో వారంటే భయం కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తారు. అది చాలా తప్పు.. ఇలాగే ఓ స్కూల్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది... ఏంటంటే ఒక టీచర్ ‘నేను నీకు రెండు అరటి పండ్లు, రెండు సంత్ర పండ్లు ఇస్తే మీ దగ్గర మొత్తం ఎన్ని పండ్లు ఉంటాయి?’ అని అడిగింది. దానికి ఆ పిల్లవాడు ‘ఐదు పండ్లు’ అని చెప్పింది. దీంతో ఒక్కసారిగా టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. బాగా తిట్టింది. రెండు దెబ్బలు వేసింది. నీకు చదువు రాదు ఏంరాదు అంటూ తిట్టిపోసింది. ఆ పిల్లవాడు చాలా బాధపడ్డాడు... మళ్ళి అంతే కోపంతో ఆ టీచర్ గట్టిగా అరుస్తూ…
‘నేను నీకు రెండు అరటి పండ్లు, రెండు సంత్ర పండ్లు ఇస్తే మొత్తం కలిపి నాలుగు పండ్లు ఉంటాయి, ఐదు పండ్లు ఎలా ఉంటాయి?’ అని అరిచింది. దానికి ఆ పిల్లవాడు ‘నా బ్యాగ్ లో మా అమ్మ ఒక ఆపిల్ పండు పెట్టి పంపింది’ అని చెప్పాడు. అది విని టీచర్‌తో పాటు మిగతా విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు టీచర్ శాంతించింది తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడింది. చిన్నపిల్లలు ఉన్నది ఉన్నట్టే చెబుతారని ఆమెకు అర్థమైంది. ఆ పిల్లవాడు తన అమ్మ ఇచ్చిన పండును కూడా కలిపి చెప్పాడు. ఆ విషయాన్ని టీచర్ ఇలా అరిచి అడిగే కన్నా... మెల్లగా అడిగి ఉంటే బాగుండేది.
సో దీని బట్టి మీకు అర్థం అయ్యి ఉంటుంది. పిల్లలు కల్మషం లేని వారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న వారి తెలివితేటల్లో నిజం తప్ప అబద్దాలు ఉండదు. అది గమనించాలి. ఒక వేల వారు చెప్పింది చేసింది తప్పు అయిన అరవకుండా పూర్తి విషయం తెలుసుకోవాలి. అప్పుడు మీరు వారి దృష్టిలో మంచి టీజర్ గా ఉండిపోతారు. అప్పుడప్పుడు మన పిల్లలు చెబుతూ ఉంటారు. అమ్మ.. మా హిందీ టీచర్ చాలా మంచిది.. కానీ తెలుగు టీచర్ గయాలి అని. అంటే మీరు ఉండే విధానాన్ని బట్టి వారు మీపై ఒక అభిప్రాయానికి వస్తారు.