పిల్లలు మొండిగా మారుతున్నారా.. తల్లిదండ్రులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే!

by Hamsa |
పిల్లలు మొండిగా మారుతున్నారా.. తల్లిదండ్రులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే!
X

దిశ, ఫీచర్స్: ఈ జనరేషన్‌లో చిన్నారులకు ఎన్నో తెలివితేటలు వస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో మొండిగా తయారవుతున్నారు. చిన్నప్పటి నుంచే కొంతమంది నచ్చినవి ఇవ్వకుంటే మారం చేస్తే అలాగే అది ఇచ్చే వరకు ఏడూస్తూ కూర్చుంటారు. ఏదైనా ఆడుకునే వస్తువులు కొనివ్వకున్నా మొండిగా ప్రవర్తిస్తూ చెప్పేది వినకుండా వారు చెప్పిందే చేయాలని మొండిపట్టు పడుతున్నారు. ఇలా అన్నిటి విషయంలో మొండిగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలు పెరిగే కొద్దీ వారిలో ఈ స్వభావం పెరిగిపోతుంది.ఈ జనరేషన్‌లో చిన్నారులకు ఎన్నో తెలివితేటలు వస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో మొండిగా తయారవుతున్నారు.

ముఖ్యంగా పదేళ్ల వయసుకి వచ్చినప్పటి నుండి బయట ప్రపంచంలో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. దీంతో చదువుపై శ్రద్ధ పెట్టకుండా స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. మీ మాట వినడానికి ఇష్టపడకుండా బయట ప్రపంచానికి ఆకర్శితులై విచ్చల విడిగా తిరుగుతారు. ఆ విషయం మీకు తెలిసి మందలించినప్పటికీ వారి మొండితనంతో మీరు ఇంకోసారి ప్రశ్నించకుండా చేస్తారు. ఇలాంటి సమయంలో వారిపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారి మొండితనాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం అని అంటున్నారు.

* పిల్లలు ఏదో ఒకటి తమకు కావాలని మిమ్మల్ని కొనివ్వమని అడుగుతారు. మీరు అది ఇప్పిస్తే పదే పదే అడుగుతుంటారు. వారు చెప్పిందల్లా మీరు వినాలని అనుకుంటారు. ఇక వారు చెప్పిన దానికి మీరు ఎప్పుడైనా నో చెప్పారో ఇక అంతే సంగతి ఏడుపు స్టార్ చేసి ఒప్పుకునే వరకు మొండిగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కోపం తెచ్చుకోకుండా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదా వారి మైండ్‌ను ఇతర వాటిపైకి మరల్చాలి.

*మొండిగా ప్రవర్తిస్తున్నారని పిల్లలు చెప్పిన వాటన్నింటికీ నిరాకరించ కూడదు. అలా చేయడం వల్ల నెగిటివ్ ఆలోచనలు పెరిగి కఠినంగా మారిపోతారు వారు చెప్పింది వినే దాకా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటారు. కాబట్టి వారికి కూడా కొంత స్వేచ్ఛను ఇవ్వాలి. ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకుండా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి కూడా పంపాలి.

*వారు ఏదైనా తప్పు చేసినప్పుడు తన తప్పును అంగీకరిస్తే కొట్టడం తిట్టడం వంటివి చేయకూడదు. లేదంటే వారు మొండిగా మారి మళ్లీ మళ్లీ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో మంచిగా ఉండి తప్పు చేస్తే చెప్పాలని అలా ఇంకోసారి చేయొద్దని చెప్పాలి.

* పిల్లలతో వాదించడం మంచిది కాదు. అలా చేయడం వల్ల వారు ప్రతి చోట ఇలాగే ప్రవర్తిస్తూ ఇతరులకు చిరాకు వచ్చేలా చేస్తారు. దీంతో తర్వాత ఎలాంటి పరిణామాలు అయినా చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మొండిగా ఎంతసేపైనా వాదిస్తూ కోపంలో అనుచితంగా కూడా ప్రవర్తిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వాదించకుండా వారంతట వారు కొన్ని విషయాలు నేర్చుకునేలా, అర్థం చేసుకునేలా చేయండి.

*పిల్లలు ఏడుస్తూ, అరుస్తూ మిమ్మల్ని అన్నింటికి ఒప్పించాలని అనుకుంటారు. మొండిపట్టు పడితే మీరే ఒప్పుకుంటారనే భావనలో ఉండిపోతారు. దీంతో ప్రతిసారి అదే డ్రామా ప్లే చేస్తుంటారు. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు కటువుగా ఉండటం మంచిది. వారి డ్రామా కనిపెట్టి అక్కడి నుంచి ఇతర చోటుకు తీసుకెళ్లాలి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము.

Advertisement

Next Story