- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Anger control tips : కోపంలో ఉన్నప్పుడు శరీరంలో జరిగే ఆ మార్పు దేనికి సంకేతం?
దిశ, ఫీచర్స్ : మనుషుల్లో కనిపించే సాధారణ భావోద్వేగాల్లో కోపం ఒకటి. ఇది సహజమే అయినప్పటికీ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా బయటకు వ్యక్తం అవుతూ ఉంటుంది. కొందరు తమలో తాము నియంత్రించుకుంటే.. మరి కొందరు కంట్రోల్ చేసుకోలేక బయటపడుతుంటారు. ఇక కోపం రావడానికి గల కారణాలు కూడా భిన్నంగా ఉంటాయి. వివాదాలు జరిగినప్పుడో, ఇతరులు తమకు నచ్చని పని చేసినప్పుడో వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని మాటలు విన్నప్పుడో, అనుకున్నది జరగనప్పుడో కూడా రావచ్చు. ఏది ఏమైనా అతి కోపం మనిషికి శత్రువు లాంటిది అంటారు నిపుణులు. అయితే కోపం వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏవి? ఆ సందర్భంలో కాళ్లు, చేతులు ఎందుకు వణుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* కారణాలేమైనా అయి ఉండవచ్చు. కోపం వచ్చే సందర్భాలు ఎదురైనప్పుడు ఆ సంకేతాలు మెదడుకు వెళ్తాయి. దీంతో ప్రతి చర్యగా అడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి వెంటనే శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్తుంది. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రేరణ కూడా లభిస్తుంది. ఈ సందర్భంలో ఆ పరిస్థితిని ఎదుర్కోవాలా? లేక అక్కడి నుంచి వెళ్లిపోవాలా? అనే నిర్ణయం తీసుకోవడంలో కూడా అడ్రినల్ హార్మోన్ ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొందరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అక్కడి నుంచి వెళ్లిపోవడం వంటివి చేస్తారు. మరి కొందరు అక్కడే ఉండిపోయి పరిస్థితిని ఎదుర్కోవడానికి గొడవకు దిగుతారు. దీనికి ప్రధాన కారణం కోపానికి, ఒత్తిడికి కారణమైన అడ్రినల్ హార్మోన్ అధికంగా ఉండటమే.
* అడ్రినల్ హార్మోన్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అంత ఎక్కువగా కండరాలపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కాళ్లు, చేతులు, శరీరంలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులు సంభవించడం, హార్ట్ రేట్ పెరగడం వంటివి కోపంలో జరగుతుంటాయి. వీటన్నింటికీ అడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవడమే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
* పరిష్కారం ఏమిటి?
కోపం వచ్చినప్పుడు శరీరం, కాళ్లు, చేతుల వణకకుండా నియంత్రించుకోవడానికి కొన్ని చిట్కాలు పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆ సమయంలో డీప్ బ్రీత్ తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో ఆక్సీజన్ లెవల్ పెరిగి అడ్రినల్ హార్మోన్ ప్రభావాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా కోపం తగ్గిపోతుంది. అలాగే డైలీ యోగా, మెడిటేషన్, ఇతర వ్యాయామాలు వంటివి చేయడం వల్ల కూడా కోపం నియంత్రణలో ఉంటుంది. కాళ్లు, చేతుల్లో వణుకు తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడ లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.