మొసళ్లకు మందు, విందు... ఆ తర్వాత ఖేల్ ఖతమ్.. ఈజిప్షియన్ల వింత ఆచారం...

by Sujitha Rachapalli |
మొసళ్లకు మందు, విందు... ఆ తర్వాత ఖేల్ ఖతమ్.. ఈజిప్షియన్ల వింత ఆచారం...
X

దిశ, ఫీచర్స్: పురాతన ఈజిప్షియన్లు మొసళ్లను దేవతలుగా కొలిచారని చెప్తుంది తాజా అధ్యయనం. మతపరమైన ఆచారాల ప్రకారం కొన్నింటిని బలి ఇచ్చారని కూడా గుర్తించింది. బర్మింగ్‌హామ్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచిన 2.2 మీటర్ల పొడవు ఉన్న క్రొకోడైల్ పై చేసిన విశ్లేషణ ఈ విషయాలను వెల్లడించింది. ఆర్కియాలజీ అండ్ కల్చరల్ హెరిటేజ్ డిజిటల్ అప్లికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో భాగంగా మొసలిని స్కాన్ చేశారు శాస్త్రవేత్తలు. పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్ ను కనుగొన్నారు. దీన్ని వేటాడి పట్టుకొచ్చిన వెంటనే బలి ఇచ్చినట్లు నిర్ధారించారు.

మరోవైపు కల్ట్ దేవతలుగా కూడా పూజించబడ్డాయి మొసళ్లు. ఈజిప్టు అంతటా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భాగమయ్యాయి. మొసలి నుంచే భూమి సృష్టించబడిందని నమ్మారు అక్కడి ప్రజలు. సోబెక్, లార్డ్ ఆఫ్ నైలు దేవతల అవతారంగా ఆరాధించారు. ఈ క్రమంలోనే సుచుస్ ఆలయ సముదాయంలో ఉన్న చెరువులో మొసళ్లను పెంచేవారని తెలుస్తుంది. విలువైన లోహాలు, ఆభరణాలతో ముస్తాబు చేసి.. దేవతలకు నైవేద్యం అందించినట్లుగా వీటికి మాంసం, వైన్, రొట్టెలు పెట్టిన పూజారులు.. అపురూపంగా చూసుకున్నారని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

Next Story