- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రహాంతర వాసులు దాక్కున్న పర్వత శిఖరం.. కుట్రలకు నిలయంగా మారిందట
దిశ, ఫీచర్స్: అదొక అందమైన పర్వత శ్రేణి. అక్కడ గ్రహాంతర వాసులు దాక్కొని ఉంటారని, అప్పుడప్పుడూ గ్రామాల్లో సంచరిస్తూ ఉంటారని స్థానికులు నమ్ముతుంటారు. అంతేగాక ఇక్కడి యంగ్ ఏలియన్స్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతుంటారని కూడా కొందరు విశ్వసిస్తుంటారు. మరికొందరు ఆ పిరమిడ్ ఆకారపు కొండ ప్రాంతం పురాతన నాగరికతలో అన్ని రకాల కుట్ర సిద్ధాంతాలకు నిలయంగా మారిందని నమ్ముతుంటారు. ఏడేళ్లుగా మిస్టరీ స్టోరీలకు కేంద్ర బిందువుగా మారిన ఈ పిరమిడ్ ఆకారపు శిఖరం అంటార్కిటికాలోని ఎల్స్‌వర్త్ పర్వత శ్రేణిలో ఉంది. దీని గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. కొందరు అది అద్భుత శక్తులు కలిగినా ‘మాయా పర్వత శిఖరం’ అని కూడా పేర్కొంటారు. మరికొందరు అదంతా తప్పుడు ప్రచారం. ఊహాగానాలు అని కొట్టిపారేస్తుంటారు.
అసలు అంటార్కిటికాలోని పిరమిడ్ ఆకారపు పర్వత శిఖరం గురించి ఎందుకిలా చర్చించుకుంటారు? అక్కడ ఏలియన్స్ ఉంటారని ఎలా తెలుసు? ఆధారాలైతే లేవుకానీ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు. ఎవరూ అక్కడికి వెళ్లి చూసింది లేదు. కాకపోతే 2016లో మాత్రం ఈ పర్వతానికి చెందిన చిత్రాలు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. ఇవి ఈజిప్టియన్ పిరమిడ్‌లను పోలిన డిజైన్‌తో ఉండటంవల్ల అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఒక పిరమిడ్ ఆకారపు శిఖరం బేస్ వద్ద ప్రతీ దిశలో 2 కిలోమీటర్ల చతురస్రకారపు భౌగోళిక నిర్మాణం ఉంది.
అదే ఏలియన్ల స్థావరమని కొందరు అంటుంటే.. అన్ని రకాల ఆన్‌లైన్ కుట్ర సిద్ధాంతాలకు ప్రేరణగా మారిందని మరికొందరు చెప్తుంటారు. చరిత్రకారులు మాత్రం అది 10 వేల సంవత్సరాల క్రితంనాటి పురాతన నాగరికతలో నిర్మించబడి ఉండవచ్చని ఊహిస్తున్నారు. జియాలజిస్టులు మాత్రం అందులో అద్భుతాలేమీ లేవని పిరమిడ్ ఆకారం కలిగిన ఒక పర్వత శిఖరం మాత్రమేనని అంటున్నారు. ‘పిరమిడ్‌లు వాస్తవానికి పిరమిడ్ శిఖర పర్వతం’ అని పిలువబడే హిమానీనద ప్రాంతాల సాధారణ లక్షణమని జియాలజీ ప్రొఫెసర్ ఎరిక్ రిగ్నోట్తెలిపారు. దీని గురించి పరిశోధనలుు జరగాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.